కోటలో పాగా వేసేది ఆయనేనట!

అతి పెద్ద రాజకీయ యుద్ధం ముగిసిన తరువాత అందరి ఆసక్తి విజేతలు ఎవరు అన్న దాని మీదనే ఉంది. వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తూ తమదే విజయం అని స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీదే…

అతి పెద్ద రాజకీయ యుద్ధం ముగిసిన తరువాత అందరి ఆసక్తి విజేతలు ఎవరు అన్న దాని మీదనే ఉంది. వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తూ తమదే విజయం అని స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీదే రెండోసారి కూడా అధికారం అని ధీమాగా ప్రకటిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనను మెచ్చే అర్ధరాత్రి దాకా జనాలు క్యూ కట్టి మరీ ఓట్లు వేశారు అని శాసన సభ ఉప సభాపత్రి కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. తన విజయం మరోసారి ఖాయం అయింది అన్నారు. విజయనగరంలో మొత్తం అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటుని కూడా కైవశం చేసుకుంటామని ఆయన జోస్యం చెబుతున్నారు.

ఈసారి విజయనగరంలో తనకు పార్లమెంట్‌ స్థానంలో బెల్లాన చంద్రశేఖర్‌కు భారీ ఎత్తున మెజారిటీ  వస్తుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని రకాల వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేశారని, అయినా తమదే విజయం అని ఆయన చెప్పారు. ప్రజలు ఆదరించిన వారిదే అందలం అని మరోసారి రుజువు కాబోతోంది అన్నారు.

కోలగట్ల వీరభద్రస్వామి విజయం అంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ఓటమి చెందుతుందా అన్న చర్చ సాగుతోంది. విజయనగరంలో ఈసారి టీడీపీ గెలుస్తుంది అని ధీమాగా ఉన్న రాజు గారి కుటుంబాన్ని ముచ్చటగా మూడవసారి ఓడించి కోలగట్ల హ్యాట్రిక్ కొడతారా అంటే ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.