మంత్రిత్వ శాఖలు కూడా ప్రకటించేస్తే సరి!

ఆలు లేదు చూలు లేదు అన్నట్లు వుంది చినబాబు లోకేష్ వైనం. పాదయాత్రలో తానే అభ్యర్ధులను డిసైడ్ చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరూ వుండగానే తానే అన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. …

ఆలు లేదు చూలు లేదు అన్నట్లు వుంది చినబాబు లోకేష్ వైనం. పాదయాత్రలో తానే అభ్యర్ధులను డిసైడ్ చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరూ వుండగానే తానే అన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

పనిలో పనిగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నామని, వస్తూనే జాబ్ కేలండర్ ప్రకటిస్తామని కూడా చెప్పేసారు. బాబు అధికారంలోకి వస్తే పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ క్యూ కట్టి వచ్చేస్తాయని చెప్పేసారు.

నిజానికి ఇదంతా జగన్ స్కీమ్ నే. గతంలో యాత్ర టైమ్ లో జగన్ చేసిన ఫీట్ ఇదే. కానీ అప్పుడు జగన్ చేయడానికి ఇప్పుడు లోకేష్ చేయడానికి మధ్యలో అయిదేళ్లు పెదబాబు..చిన బాబు కలిసి అధికారం వెలగబెట్టిన వైనం వుంది. అలాగే జగన్ పాలనను జనం చూసిన సంగతీ వుంది. అందువల్ల ఇక సదా తాతల మూతుల వాసనలు వల్లెవేయనక్కరలేదు.

జనాలకి బాబు ఘనత ఏంటో, జగన్ వల్ల లాభాలు ఏంటో క్లారిటీ వచ్చింది. అందువల్ల లోకేష్ పదే పదే ఇదే పని చేస్తూ పోనక్కరలేదు. కొత్తగా ఆలోచించాలి. ముందే మంత్రి పదవులు కూడా ప్రకటించేయడం లాంటివి. గమ్మత్తేమిటంటే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి, లక్షలాది ఉద్యోగాల కల్పనకు పునాదులు వేసిననాడే లోకేష్ ఇలా జాబ్ కేలండర్ గురించి మాట్లాడడం.

బాబు అండ్ కో అదృష్టం ఏమిటంటే మధ్యలో రెండేళ్లు కోవిడ్ రావడం లేదూ అంటే ఈ సమ్మిట్ ను జగన్ ఓ ఏడాది ముందే ప్లాన్ చేసి వుంటే, ఇప్పుడు లోకేష్ ఈ మాత్రం మాట్లాడడానికి కూడా చాన్స్ వుండి వుండేది కాదేమో?