మంత్రి నారాయ‌ణ వ‌ర్సెస్ కోటంరెడ్డి

ఇందులో భాగంగా నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు త‌మ ప‌రిధిలో ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూళ్ల‌కు శ్రీ‌కారం చుట్టారు.

కూట‌మి నేత‌ల మ‌ధ్య వార్ రాష్ట్ర వ్యాప్తంగా మొద‌లైంది. ఇప్పుడు నెల్లూరులో మంత్రి నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌న్ను వ‌సూళ్ల విష‌యంలో నారాయ‌ణ‌, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మ‌ధ్య పోరు షురూ అయ్యింది. మంత్రి నారాయ‌ణ మున్సిప‌ల్‌శాఖ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌న్నుల వ‌సూళ్ల‌కు మంత్రి నారాయ‌ణ ఆదేశాలు ఇచ్చారు.

ఇందులో భాగంగా నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు త‌మ ప‌రిధిలో ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూళ్ల‌కు శ్రీ‌కారం చుట్టారు. నెల్లూరు కార్పొరేష‌న్ ప‌రిధిలోకి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని డివిజ‌న్లు వ‌స్తాయి. ఇక్క‌డే గొడ‌వ‌కు బీజం ప‌డింది. త‌న ప‌రిధిలోని డివిజ‌న్ల ప‌రిధిలో అంతా పేద ప్ర‌జ‌లున్నార‌ని, కావున ప‌న్నుల వ‌సూళ్లుకు ఒప్పుకునేది లేద‌ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తేల్చి చెప్పారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి మంత్రైనా, మ‌రెవ‌రైనా వ‌స్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌న‌ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు కార్పొరేష‌న్ ఉద్యోగులు న‌లిగిపోతున్నారు. ప‌న్ను వ‌సూళ్ల‌ను నారాయ‌ణ ట్యాక్స్‌గా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీన్ని ఏ విధంగా కూట‌మి స‌ర్కార్ ప‌రష్క‌రిస్తుందో చూడాలి.

7 Replies to “మంత్రి నారాయ‌ణ వ‌ర్సెస్ కోటంరెడ్డి”

  1. అసలు మన అన్న పార్టీ లో విభేదాలు ఉన్నాయా ???బొత్స -వీసా , రోజా -పెద్దిరెడ్డి, గుడివాడ-బొత్స మన మాజీ డీ సీఎం ఇంట్లో సొంత కొడుకే వీధి ఎక్కి రచ్చ చేసారు?? ఇలా ఎన్ని లేవు ???? ప్రతి పార్టీ లో ఇది సాధారణమే

Comments are closed.