టిడిపి జనసేన పొత్తుల్లో తొలి ముసలం నాదెండ్ల!

తెలుగుదేశం- జనసేన పొత్తులు పెట్టుకోడానికి సిద్ధం అయ్యాయి. నాయకత్వం పొత్తులకు డిసైడ్ అయింది. అయితే ఏయే నియోజకవర్గాలు ఎవరికి దక్కుతాయనే పంచాయతీ ఇంకా తేలలేదు.  Advertisement సహజంగా ఈ విషయంలో ప్రతిచోటా కుమ్ములాటలు తప్పవు.…

తెలుగుదేశం- జనసేన పొత్తులు పెట్టుకోడానికి సిద్ధం అయ్యాయి. నాయకత్వం పొత్తులకు డిసైడ్ అయింది. అయితే ఏయే నియోజకవర్గాలు ఎవరికి దక్కుతాయనే పంచాయతీ ఇంకా తేలలేదు. 

సహజంగా ఈ విషయంలో ప్రతిచోటా కుమ్ములాటలు తప్పవు. రెండు పార్టీల్లోనూ సీట్ల పంపకాలపై బోలెడన్ని అసంతృప్తులు వెల్లువెత్తుతాయి. పవన్ కల్యాణ్ కాస్త ముందు జాగ్రత్త పడి.. ‘‘సీట్ల విషయం పూర్తిగా నాకు వదిలేయండి.. సర్వే రిపోర్టుల్లో మన పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీట్లను మాత్రమే తీసుకుంటాను.. ఈ విషయంలో ఎవ్వరూ ఎలాంటి ఒత్తిడి చేయవద్దు’’ అంటూ పార్టీ శ్రేణులకు క్లియర్ సందేశం ఇచ్చేశారు. 

ఇరుపార్టీల్లోనూ ఎవరైనా సీట్ల పంపకం నిర్ణయాలతో విభేదిస్తే గనుక.. అది పొత్తులకు ముసలం అవుతుంది. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. తెలుగుదేశంతో జనసేన పొత్తుకు తొలి ముసలంగా నాదెండ్ల మనోహర్ తయారయ్యేలా ఉన్నారు.

ఒకవైపు తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు సంగతి పవన్ కల్యాణ్, చంద్రబాబుతో మాట్లాడుకుంటారు అంటూనే.. తెనాలి నియోజకవర్గం నుంచి తాను పోటీచేయబోతున్నానని నాదెండ్ల మనోహర్ తేల్చిచెబుతున్నారు.

నాదెండ్లకు ఈసారి నియోజకవర్గం లేదా? అనే శీర్షికతో గ్రేట్ ఆంధ్ర శనివారం నాడు ఒక కథనం అందించింది. పవన్ కల్యాణ్ అచ్చంగా సర్వే నివేదికల మీద మాత్రమే ఆధారపడి పొత్తుల్లో నియోజకవర్గాలను కోరుతానని తేల్చేసిన నేపథ్యంలో.. నాదెండ్లకు తెనాలి దక్కడం కష్టమేనని అందులో వివరించడం జరిగింది. 

నాదెండ్లకు 2019లో కేవలం 30 వేల ఓట్లు రాగా, తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు 76 వేల ఓట్లు వచ్చాయి. అప్పటినుంచి నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ పెరిగినదేమీ లేదు. అంతబలమైన సీటును తెలుగుదేశం వదులుకోదు. 2019లో ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న తెనాలిని, పవన్ కల్యాణ్ కూడా పట్టుబట్టి అడగలేరు. 

జనసేనతో పొత్తు కోసం నాదెండ్ల లాంటి బలంలేని నాయకుడి కోసం, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వంటి నేతను పక్కన పెడితే.. తన  పార్టీ శ్రేణులకు చంద్రబాబునాయుడు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. ప్రాక్టికల్ గా చూసినప్పుడు వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

కానీ, నాదెండ్ల మాత్రం.. తాను మోనార్క్ ను అన్నట్టుగా తెనాలి నుంచి పోటీచేయబోతున్నట్లుగా ముందే ప్రకటించేసుకున్నారు. పొత్తుల సంగతి ఎలాగైనా కొట్టుకు చావండి.. నా సీటులో వేలుపెడితే కుదరదు అని సంకేతాలిచ్చారు. ఆయన గట్టిగా పట్టుబడితే గనుక.. తెలుగుదేశం- జనసేన పొత్తులు వికటించడానికి దారి తీయవచ్చు. ఆ రకంగా ఆ పొత్తులకు నాదెండ్ల తొలి ముసలంగా మారే అవకాశం కనిపిస్తోంది.