మెగా బ్రదర్ నాగబాబులో కామెడీ యాంగిల్ చాలా ఉంది. ఆయన టైంలీ గా వేసే పంచులకు ఫ్యాన్ మెయిల్ కొడా చాలా ఉంది. ఉన్నట్లుండి నాగబాబు వదిన అన్న ఒక పాత సినిమా పోస్టర్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అప్పట్లో బాగా నచ్చిన సినిమా ఇది అని క్యాప్షన్ పెట్టారు.
ఇక అంతే దాని మీద ఎవరికి వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఈ టైం లో ఎందుకు అలా పెట్టారు అంటే అందులోనే అసలైన పాలిటిక్స్ ఉంది. నిన్నటికి నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ని తన నాలుగవ పెళ్లాం అంటూ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసాయి.
తరచూ తనకు నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయని జగన్ విమర్శించడాన్ని తట్టుకోలేని పవన్ కళ్యాణ్ నాకు లేని నాలుగవ పెళ్లి పెళ్లాం గురించి జగన్ అబద్ధాలు చెబుతున్నారు అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అంతే దాంతో ఆయన ఆ నాలుగవ పెళ్లాం నీవెనా జగన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
దాంతో దాని మీద వైసీపీ వర్సెస్ జనసేనగా సోషల్ మీడియాలో అతి పెద్ద యుద్ధమే సాగుతోంది. పవన్ మూడు పెళ్ళిళ్ల గురించి జగన్ తరచూ చేసే కామెంట్స్ కి సరైన రిటార్ట్ పవన్ ఇచ్చారు అని జనసైనికులు అంటున్నారు. అదే టైం లో మీమ్స్ కూడా ఒక రేంజిలో పేలుతున్నాయి.
పవన్ ని అన్నగా భావించే జన సైనికులు జగన్ ని తన పెళ్ళాం గా పవన్ సంభోదించిన దాన్ని ఉద్దేశించి జగన్ ని వదిన అంటూ సోషల్ మీడియాలో రాగింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వదిన అన్నది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో మారుమోగుపోతోంది.
సరిగ్గా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నాగబాబు వదిన పేరుతో పోస్టర్ వదిలారు. ఇది జనసేన ఫ్యాన్స్ కి ఖుషీ చేయడానికే నాగబాబు ఇలా చేశారు అని అంటున్నారు. గతంలో కూడా నాగబాబు నందమూరి బాలక్రిష్ణ మీద విమర్శలు చేసినపుడు పాతకాలం హాస్యనటుడు బాలక్రిష్ణ తనకు తెలుసు అంటూ పంచులు వేసి నందమూరి ఫ్యాన్స్ ని కెలికి వదిలిపెట్టారు.
ఇపుడు చూస్తే ఎన్నికల సీజన్ లో నాగబాబు చూసి మరీ వదిన పోస్టర్ తో సోషల్ మీడియా వార్ అగ్గిలో ఆజ్యం పోసారు. ఇప్పటికే అటు జనసైనికులు ఇటు వైసీపీ అభిమానుల మధ్య వీర లెవెల్ లో జరుగుతున్న ఈ యుద్ధంలో నాగబాబు ఇలా ఎంటర్ అయ్యారు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో సోషల్ మీడియా వార్ ఒక రేంజిలో సాగుతోంది. ఎన్నికల వేళ అది మరింత వేడిగా వాడిగా సాగుతోంది. మరి నాగబాబు పెట్టిన వదిన పోస్టర్ కి ఆయన క్యాప్షన్ మీద వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.