ఇంతకూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరికి తెలుసు.? మనం అంత కచ్చితంగా తేల్చి చెప్పలేం!
ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 250 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినందుకే సిఐడి ఆయనను అరెస్టు చేసిందని ఆ చర్యను సమర్ధించేవారు అంటారు! అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు మీద కక్ష సాధించడానికి ఈ అరెస్టు వంటి దురాగతానికి పాల్పడిందని తెలుగుదేశం అభిమానులు అంటారు. ఈ రెండు రకాల వాదనలు రాష్ట్రంలో మనకు ముమ్మరంగా వినిపిస్తాయి అయితే ఎంతో మేధావి అయిన నారా లోకేష్ ఈ రెండు కాకుండా ఒక సరికొత్త కారణాన్ని చంద్రబాబు అరెస్ట్ వెనుక ప్రభుత్వ ఉద్దేశంగా సీక్రెట్ బయట పెడుతున్నారు.
చినబాబు నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి మాత్రమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించిందట. యువగళం పాదయాత్ర ద్వారా చినబాబు చేస్తున్న విమర్శలు చూసి భయపడి జడుసుకుని, ఆ పాదయాత్రను అడ్డుకోవడానికి వేరే మార్గం లేక చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే అది ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి పని చేసినట్లుగా లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు ఇంతకు మించిన ప్రగల్భాలు బహుశా వర్తమాన రాజకీయ ప్రపంచంలో ఉండకపోవచ్చు.
చంద్రబాబు నాయుడు అరెస్టును తెలుగుదేశం పార్టీ కి అడ్వాంటేజీ గా వాడుకోవడానికి ప్రయత్నించడం ఒక ఎత్తు, అది కూడా కాకుండా తన వ్యక్తిగత మైలేజీ కోసం రంగులు పులిమి మాట్లాడడం అనేది నారా లోకేష్ చవకబారుతనానికి నిదర్శనం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే యువ గళం పాదయాత్ర ఆగదు అంటూ చినబాబు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
ఒకవైపు చంద్రబాబు నాయుడు ఈ అరెస్టును తన సొంత రాజకీయ మైలేజ్ కోసం వాడుకోవాలనుకుంటున్నారు తాను ఒక మహానుభావుడిగా జగన్ తనను వేధిస్తున్న రాక్షసుడిగా అభివర్ణించి లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ఇదే అరెస్టును తన మైలేజీ కోసం వాడుకోవాలని నారా లోకేష్ కూడా ఆశపడటం కామెడీగా ఉంది.
తన యాత్ర ఎవరు ఎన్ని చేసినా ఆగదు అని ప్రగల్బాలు పలుకుతున్న లోకేష్.. ఉత్తరాంధ్రలో వ్యతిరేకత గురించిన భయం కాకపోతే విశాఖపట్నంలోనే ఎందుకు ఆపివేస్తున్నాడో ప్రజలకు సహేతుకమైన కారణం చెప్పాలి.
తండ్రి అరెస్టు అయిన నాటి నుంచి బయటకు వచ్చేవరకు ఈ పాదయాత్ర ఆగిన సంగతి.. ఈ మధ్యకాలంలో అజ్ఞాతంలో బతుకుతున్న సంగతి.. ఇప్పుడు పలుకుతున్న ప్రగల్భాలకు విరుద్ధంగా ఉంది కదా అనే సంగతి కూడా ఆయన ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు తన మాటలు తర్కానికి నిలిచేవో కాదో తూకం వేసుకోవడం ఈ యువనేత నేర్చుకోవాలి.