బాల‌కృష్ణను చెడుగుడు ఆడుతున్న నెటిజ‌న్లు!

హిందూపురం ఎమ్మెల్యే, అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. దీనికి కార‌ణం… బుధ‌వారం ఆయ‌న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు హిత‌బోధ చేయ‌డ‌మే.  Advertisement బాల‌కృష్ణ కాకుండా మ‌రెవ‌రైనా…

హిందూపురం ఎమ్మెల్యే, అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. దీనికి కార‌ణం… బుధ‌వారం ఆయ‌న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు హిత‌బోధ చేయ‌డ‌మే. 

బాల‌కృష్ణ కాకుండా మ‌రెవ‌రైనా మాధ‌వ్ చేష్ట‌ల్ని త‌ప్పు ప‌డితే అర్థం చేసుకోవ‌చ్చ‌ని, మ‌హిళ‌ల‌పై అవాకులు చెవాకులు పేలిన బాల‌కృష్ణ నీతులు చెప్ప‌డం ఏంట్రా బాబు అని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.

స‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురం జిల్లాకు ఇవాళ బాల‌కృష్ణ వెళ్లారు. రెండురోజుల పాటు ఆయ‌న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ సిగ్గుతో త‌ల‌దించుకోకుండా జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌కు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ‌చ్చాడ‌న్నారు. గోరంట్ల‌ను అడ్డుకోడానికి వెళ్లిన త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశార‌న్నారు. ఇలాంటి వాటికి భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎందాకైనా వెళ్తామ‌న్నారు.

ఇటీవ‌ల గోరంట్ల న్యూడ్ వీడియో రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దానిపై హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బాల‌కృష్ణ ఘాటుగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో బాల‌య్య‌పై నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు. గ‌తంలో ఓ సినిమా ఫంక్ష‌న్‌లో బాల‌కృష్ణ మాట్లాడుతూ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా అన్న మాట‌ల‌ను గుర్తు చేస్తున్నారు.

అప్ప‌ట్లో బాల‌య్య ఏమ‌న్నారంటే… “ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి… కమిట్ అయిపోవాలి అంతే” అని అన్నారు. అప్ప‌ట్లో బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ పార్టీల నేత‌లు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన బాల‌కృష్ణ వారికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో వైఎస్ జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

ఆడ‌వాళ్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బాల‌య్య కూడా గోరంట్ల మాధ‌వ్ ఉదంతంపై విమ‌ర్శించ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు వెల్లువెత్తుతున్నాయి. గోరంట్ల ఎపిసోడ్‌పై మాట్లాడే నైతిక హ‌క్కు బాల‌య్య‌కు లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాల‌య్య కాకుండా మ‌రెవ‌రైనా మాట్లాడితే అర్థం చేసుకోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.