తెలంగాణ సీఎం కేసీఆర్.. బిఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో స్పందించారు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ. తెలంగాణ సీఎం జాతీయ పార్టీ కాకపోతే అంతర్జాతీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్ని, కేసీఆర్ తో తమ పార్టీకి ఎటువంటి అవగాహన లేదన్నారు. అవినీతి సొమ్ముతోనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాయంటూ రాహుల్ ఆరోపించారు.
బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతు దోచుకుంటున్నాయన్నారు. ఫిట్నెస్ కోసం పాదయాత్ర చేయాడం లేదని, ఫిట్నెస్ కావలంటే జిమ్ చేస్తే సరిపోతుందన్నారు. దేశ మనుగడ కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నామన్నారు. దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్ని, విపక్షాల మధ్య ఐక్యత రావాలని రాహుల్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎటూవంటి పొత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. దేశంలో హింసను బీజేపీ ప్రోత్సహిస్తోందని, బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ.
మొత్తానికి తెలంగాణన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ మాటల ద్వారా టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎట్టి పరిస్ధితిలోను పొత్తు ఉండబోతున్నట్లు ఆర్ధం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాతో ఉన్న రాహుల్ గాంధీ తెలంగాణకాంగ్రెస్ లో కుమ్ములాటనికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.