రోగుల‌కు డాక్ట‌ర్ కాని టీడీపీ ఎమ్మెల్యే వైద్య‌ప‌రీక్ష‌లు!

పీహెచ్‌డీ డాక్ట‌ర్ అయిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో రోగుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఏకంగా మెడికల్ క్యాంప్‌లు నిర్వ‌హిస్తున్నారాయ‌న‌. దీంతో రోగుల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంద‌నే భ‌యాందోళ‌న…

పీహెచ్‌డీ డాక్ట‌ర్ అయిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో రోగుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఏకంగా మెడికల్ క్యాంప్‌లు నిర్వ‌హిస్తున్నారాయ‌న‌. దీంతో రోగుల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంద‌నే భ‌యాందోళ‌న నెల‌కుంది. డాక్ట‌ర్ కాని ఆ డాక్ట‌రే వీఎం థామ‌స్‌.

ఈయ‌న చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు నుంచి టీడీపీ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న‌కు చెన్నైలో ఆస్ప‌త్రి వుంది. ఈయ‌న గారు ఎంబీబీఎస్‌లో ప‌ట్ట‌భ‌ద్రుడు కాదు. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. అయితే త‌న పేరుకు ముందు డాక్ట‌ర్‌ను తగిలించుకుని రోగుల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. బాధ్య‌తాయుత‌మైన ఎమ్మెల్యే ప‌ద‌విలో వుంటూ, పీహెచ్‌డీ చేసి డాక్ట‌రేట్ సాధించిన విష‌యాన్ని విస్మ‌రించడం ఏంట‌నే నిల‌దీత ప్ర‌జానీకం నుంచి వ‌స్తోంది. థామ‌స్ వ్య‌వ‌హార శైలిపై సొంత పార్టీ నుంచి కూడా వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

థామ‌స్ చేష్ట‌ల‌తో త‌మ పార్టీకి చెడ్డ‌పేరు వ‌చ్చేలా వుంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. థామ‌స్ వైద్యంతో జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగితే ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌స్తే , ఆ న‌ష్టాన్ని ఎవ‌రు భ‌రిస్తార‌ని టీడీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికైనా థామ‌స్ వైద్యంపై ప్ర‌భుత్వం దృష్టి సారించి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

11 Replies to “రోగుల‌కు డాక్ట‌ర్ కాని టీడీపీ ఎమ్మెల్యే వైద్య‌ప‌రీక్ష‌లు!”

    1. గోరంట్ల మాధవ్ గురించేనా… అందుకేగా ఆ జిల్లా మొత్తం నాకిపోయాడు..

      1. ఈజే గాడికి 15000, జల్సా జగ్గుడికి పదిహేనువేలు,కాముడికి పదిహేను వేలు,యల్లాజోస్యుల కు పదిహేను వేలు.కేఛీఆర్ కి మూడేలు ఫింఛన్

  1. డాక్టరేట్ ఇవ్వగానే డాక్టర్ అనుకుంటున్నాడేమో.. ఎవడైనా ఆ మొహాన నీళ్ళు కొట్టి వివరం చెప్పండయ్యా

  2. అక్కడ 90 నియోజకవర్గాల్లో నాయకత్వం లేదంటా ముందు వాళ్ళను చూసుకోండి .. ఆంధ్రప్రదేశ్ లో RMP లు కూడా చేస్తున్నారులే .. ప్రెసుమీత్ కూడా పెట్టలేని వాడిని మనలని పరిపాలించాడు గా ఇది కూడా అంతే .

Comments are closed.