అండ‌గా ఉంటాన‌న్న ప‌వ‌న్ ఎక్క‌డ‌?

బీజేపీ నుంచి ముస్లింల‌కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. తెలంగాణ‌లో తాము అధికారంలోకి వ‌స్తే ముస్లింల నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌ను…

బీజేపీ నుంచి ముస్లింల‌కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. తెలంగాణ‌లో తాము అధికారంలోకి వ‌స్తే ముస్లింల నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఇటీవ‌ల చేవెళ్ల స‌భ‌లో కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఒక‌వేళ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఏపీలో చంద్ర‌బాబు అధికారం చేప‌డితే, ఆ రాష్ట్రంలో కూడా ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ముస్లింల‌కు సంబంధించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన భ‌రోసా ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముస్లింల జోలికి వ‌స్తే ఊరుకోన‌ని, మైనార్టీల‌కు అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇచ్చారు. ముస్లింల‌కు అన్యాయం జ‌రిగితే బీజేపీతో ఉండ‌న‌ని కూడా ప‌వ‌న్ తేల్చి చెప్పారు. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముస్లింల రిజ‌ర్వేష‌న్ తొల‌గిస్తామ‌ని అమిత్‌షా ప్ర‌క‌టించార‌ని, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకు స్పందించ డం లేద‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మౌనాన్ని అర్ధంగీకార‌మ‌ని అనుకోవాలా? అని అంటున్నారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్‌పై బీజేపీ మ‌నోగ‌తం ఏంటో అర్థ‌మైన త‌ర్వాత కూడా ప‌వ‌న్ మౌనాన్ని ఆశ్ర‌యించారంటే… ఆయ‌న భ‌య‌ప‌డుతు న్నార‌ని అనుకోవాలా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ముస్లింలను బీజేపీ శ‌త్రువులుగా చూస్తోంద‌న్న‌ది వాస్త‌వం. క‌ర్నాట‌క‌లో ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.

ప్ర‌స్తుతం రిజ‌ర్వేష‌న్ ర‌ద్దుపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ముస్లింల‌ను ఈ దేశ పౌరులే కాద‌న్న‌ట్టుగా మోదీ స‌ర్కార్ అణ‌చివేత చ‌ర్య‌లు చేపట్టింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. బీజేపీ పాల‌న‌లో ముస్లింలు అభ‌ద్ర‌త‌కు గురి అవుతున్నార‌నేది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో ముస్లిం రిజ‌ర్వేష‌న్‌పై అమిత్‌షా వార్నింగ్ ఇచ్చినా మిత్రుడైన ప‌వ‌న్ నోరు తెర‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మేస్తోంది.