వివేకా కుమార్తె పంతం.. ప్చ్‌!

సుప్రీంకోర్టులో మ‌రోసారి అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ జూలై చివ‌రి వారానికి వాయిదా ప‌డ‌డం సునీత‌ను తీవ్ర నిరుత్సాహ ప‌రిచింది.

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాల‌ని దివంగ‌త వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుపై సునీత అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం స‌త్ఫలితాలు ఇవ్వ‌డం లేదు. అవినాష్‌రెడ్డిని జైల్లో వేయించాల‌ని డాక్ట‌ర్ సునీత ఎంత బ‌లీయంగా కోరుకుంటున్నారో, అది అంత‌కంత‌కూ వెన‌క్కి పోతోంది.

సుప్రీంకోర్టులో మ‌రోసారి అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ జూలై చివ‌రి వారానికి వాయిదా ప‌డ‌డం సునీత‌ను తీవ్ర నిరుత్సాహ ప‌రిచింది. అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అద‌న‌పు అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ అధికారి రామ్‌సింగ్‌తో పాటు సునీత దంప‌తుల‌పై కావాల‌నే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేసు పెట్టార‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డి త‌న‌ను సీబీఐ అధికారి, అలాగే సునీత దంప‌తులు వేధిస్తున్నార‌ని ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పోలీసులు కేసు పెట్ట‌లేదు. దీంతో ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించి, వాళ్ల‌పై కేసు న‌మోదు చేసేలా సానుకూల తీర్పు పొందారు.

కానీ ఏపీలో ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో సీబీఐ అధికారి, సునీత దంప‌తుల‌కు అనుకూలంగా సుప్రీంకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం. అవినాష్‌రెడ్డి బ‌య‌ట వుంటే, సాక్ష్యాల‌ను బెదిరించి, సాక్ష్యాల‌ను తారుమారు చేస్తార‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అని చూపుతూ, బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సునీత త‌ర‌పు న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.

అయితే కౌంట‌ర్ అఫిడవిట్ దాఖ‌లుకు కొంత స‌మ‌యం కావాల‌ని అవినాష్‌రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాదులు కోరారు. ఇందుకు చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా ధ‌ర్మాస‌నం సానుకూలంగా స్పందించింది. జూలై ఆఖ‌రు వారానికి విచార‌ణ‌ను వాయిదా వేస్తూ, ఆ లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని అవినాష్ త‌ర‌పు న్యాయ‌వాదిని ఆదేశించింది. దీంతో సునీతకు నిరుత్సాహం త‌ప్ప‌లేదు.

15 Replies to “వివేకా కుమార్తె పంతం.. ప్చ్‌!”

  1. ఎలాగయినా జైలుకి పంపించటం ఎమిటిరా???.. వాడు ఎదొ పత్తిత్తు అయినట్టు! 

    హత్య చెసిన వాళ్ళె చెపుతున్నారుగా! వాడె చెయించాడు అని!!

    1. మరి అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? ఇంతకు ముందు జగన్ కాపాడుతున్నాడు అన్నారు, మరి ఇపుడు బాబు కాపాడుతున్నాడా?

        1. నేను కాదురా మీరు. ఇన్నాళ్లు వివేక హత్య పైన కుక్కల్లా మొరిగింది మీరు. 

      1. ఇంత బుర్ర తక్కువు వెధవులు ఎంటిరా మీ Paytm గాళ్ళు. వాడు అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకునాడు, ఆ బెయిల్ కాన్సిల్ చేయమని పిటిషన్ వేసారు అని క్లియర్ గా రాసాడు గా GA. Aa బెయిల్ కాన్సిల్ అయ్యాక కచ్చితం గా నీ కోరిక తీరిది 

        1. అంటే ఇంకా ప్రూవ్ కానీ దానిమీద ఇన్నాళ్ళు మీ ఏడుపులు దేనికిరా వెధవన్నార వెధవ. రిప్లై ఇవ్వడం చేతకాకపోతే మూసుకొని కూర్చో.

    2. ఒరే బాబు వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళ కోసం మనం ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడాలి…ర్పోడ్డున వాళ్ళే కలిసిపోతారు…నీలాంటి వ్బాళ్ళు మాత్రం పిచ్చి పూక్స్లా మిగిలి పొతారు…

  2. మర్డర్ చేసింది క్లియర్ గా తెలుస్తున్నప్పుడు ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయటానికి ఏం ప్రాబ్లం ? సెంట్రల్ వాళ్ళనీ ఫుల్లుగా కొనేసుంటారు . పాపం సునీతకు న్యాయం జరగక పోవచ్చు.

  3. ఇలాంటి వి చూస్తుంటే న్యాయం కోసం కోర్ట్ లు కు వెళ్లడం కంటే నేరస్తులను ఆశ్రయించి ఎవరికివారు న్యాయం చేసుకోవడమే మంచిదనిపిస్తుంది చట్టబద్దం గ కానప్పుడు ఈ కేసులో అదే జరిగిన ఆశ్యర్య పోనవసరం లేదు జడ్జి ల మీద వాళ్ళ ఆస్తులమీద కచ్చితం గ నిఘా పెట్టవలసిన అవసరం ఈ హత్య కేసు సూచిస్తుంది ఎన్ని సంవత్సరాలైనా విచారణ జరగకుండా బైళ్ళు ఎలాగా వస్తున్నాయో కూడా దర్యాప్తు లు జరపాలి ముఖ్యం గ యాభై కోట్లు రొక్కం ఒక జడ్జి ఇంట్లో దొరికిన తర్వాత జడ్జి ల మీద ఏ విధం గ నిఘా పెట్టాలి అన్నది విద్యావంతులతోన్యాయకోవిదులతో డిబేట్ లు పెట్టి నిర్ణయం తీసుకోవాలి

  4. మర్దర్ చెయిస్తె…

    సన్మానాలు చెయకుండా…

    శాలువాలు కప్పకుండా… 

    జైలు అంటారు ఎమిటి?

    చీప్ ఫెల్లొస్ అంటావా?

  5. Cm పదవి అవకాశం కోసం సొంత తండ్రినే గాలిపంఖ కి బలి చేశాడు. తన ప్లాన్ కి గుర్తుగా అదే సింబాలిక్ గా పెట్టుకున్నాడు.

    ఎన్నికల ముందు తల్లి కి ప్లాన్ వేశాడు. ఆ మహాతల్లి నిజం తెలుసుకుని అమెరికా పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. 

    అలాంటి వాడికి తండ్రి తమ్ముడిని లేపేయడం జజ్జుబి.

Comments are closed.