పవన్ ఆవేశం కరక్టే కానీ..

భారతీయ జనతా పార్టీ నాయకుల కంటె ఎక్కువగా హిందూత్వం, సనాతన ధర్మం వంటి పదాలను ఈ దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే.. ముందుగా పవన్ కల్యాణ్ పేరే స్ఫురణకు వస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్…

భారతీయ జనతా పార్టీ నాయకుల కంటె ఎక్కువగా హిందూత్వం, సనాతన ధర్మం వంటి పదాలను ఈ దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే.. ముందుగా పవన్ కల్యాణ్ పేరే స్ఫురణకు వస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్ పహల్గాం దాడి తర్వాత ఊరుకుంటారా? అవకాశమే లేదు. ఆయనకూడా ఈ సందర్భంలో రెచ్చిపోయి మాట్టాడుతున్నారు.

ప్రత్యేకించి కొందరు కాంగ్రెస్ నేతలను ఉద్దేశంచి.. పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోయి రాజకీయం చేసుకోండి అని పవన్ కల్యాణ్ తూలనాడుతున్నారు. మరొకవైపు భాజపా నాయకులు.. ఈసారి పాకిస్తాన్ ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా పోటీచేస్తుందని ఎద్దేవా చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో కేవలం ఒక నటుడిగా భావోద్వేగాలను ఆపుకోలేకుండా మాట్లాడడం మాత్రమే కాకుండా, ఒక బాధ్యత గల డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ మరింత ఆచితూచి మాట్లాడితే బాగుటుందనేది ప్రజల అభిప్రాయంగా ఉంది.

పాకిస్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడితే.. నిస్సందేహంగా ఖండించాల్సిందే. అలాగే.. వారిమీద నిప్పులు చెరగాల్సిందే. కానీ.. ఇలాంటి సమయంలో.. నాయకుల మాటలు దేశంలో ఉన్న ముస్లిములను మరింత భయవిహ్వల పరిస్థితుల్లోకి నెట్టేసే పరిస్థితి రాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు.

పహల్గాం లో టూరిస్టులను మీరు హిందువా? ముస్లిమా? అని మతాన్ని అడిగి మరీ కాల్చి చంపేయడం ఏమాత్రం సహించరాని చర్య. అలాగే ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్లందరూ కూడా ముస్లిములే. ప్రత్యేకించి ఈ దాడిలో ఉగ్రవాదులు అందరూ ముస్లిములే ఉన్నారు. అలాగే వారిని వెనుకనుంచి పాకిస్తాన్ నడిపిస్తోందనడంలో కూడా ప్రజలకు సందేహం లేదు.

ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ను కూడా నిందించడాన్ని ప్రతి ఒక్కరూ సమర్థిస్తారు. కానీ దేశంలో ఉన్న ముస్లింలు కూడా అందరూ ఉగ్రవాదులే అని అర్థం వచ్చేలాగా.. అలాంటి అపోహలు కలిగించేలాగా.. తద్వారా దేశంలో హిందూ- ముస్లింల మధ్య పరస్పర భయాలు, అనుమానాలు పెరిగేలాగా ప్రకటనలు చేయడం మాత్రం కరెక్టు కాదు!

భారత్ సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశం అయినంత మాత్రాన.. ముస్లిములకు కొమ్ముకాయాలనేది మన ఉద్దేశం కాదు. కానీ.. ఈ దేశంలో సాధారణమైన జీవితం గడుపుతున్న ముస్లింలు ఎక్కడో కాశ్మీర్లో పాకిస్తాన్ ముస్లిములు చేసిన దుశ్చర్యలకు తాము భయపడి, బెదిరిపోయే వాతావరణం ఏర్పడకూడదు. పవన్ కల్యాణ్ లాంటి బాధ్యతగల నాయకుల మాటలు.. ఈ సంయమనంతో కూడి ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు.

16 Replies to “పవన్ ఆవేశం కరక్టే కానీ..”

  1. Pichhi peaks ra abbai neeku…

    24 hours 365 days…

    Pavan sir meeda edavadame …

    What he told and what you wrote??

    Is there any connection..

    Paytm desadrohi

  2. కాలం మారింది GA….TERRORISTS ని, పాకిస్తాన్ ని తిడితె మన దేశంలో వున్న ముస్లింలు యెందుకు భయపడతారు GA…. ఇంకా ఎంత కాలం ఇలా మీ స్వార్థం కోసం మత రాజకీయం చేస్తారు GA….హిందువుల ను అతి కిరాతకంగా చంపడo చూసి కూడా ఇలా pawan kalyan గారి మీద విషం కక్కు తున్నారు అంటే…..🙏🙏🙏🙏

  3. Nuvvu em chepdam anukunnavo neekaina clarity unda..?? PK chesindi correct antunnav malli antha avasarama ani nuvve edusthunnav??

    anakudadu kaani, nee annavallu evarina aa 27 mandhilo unte niku noppi thelisedi..nuvvu nee chetha raathalu.

    PK always talk as common man, not as politician.. kabatte athaniki fans undaru..bhakthulu untaru.

  4. Kashmir is disputed territory. Kashmiris are living under military for decades. Travel agencies, under Govt influence booking tons of people for troubled areas without any security guarantees a big issues and Govt encouraging them another big problem. 

  5. అక్కడ సరిహద్దులలో వుంది పాక్ కి రహస్యం గ సపోర్ట్ చేసే వాళ్ళను గుర్తించి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను పాక్ వెళ్లడమో వేరే దీవులు కు వెళతారో నిర్ణయించుకోమని చెప్పి పంపించేయాలి పాక్ లో హిందువులు భారత్ కు వస్తే తీసుకోవాలి రాజ్యాంగంలో ఇందిరా హయం లో చేర్చబడిన సెక్యూలర్ పదాన్ని తొలగించి హిందూ దేశం గ మార్చాలి ఎవరైనా పాక్ కి వెళ్లాలనుకొంటే పంపేయాలి 

  6. Veedu oka subject teliyani psycho…veedini oattinchukovalsina avasaram ledu…oka saari google search CHESI choodandi eppati varaku aa pakistan Nakodukulaki informations pass chesindi yevaro…border ki velli war cheyyandi,,Ekkadunna vallani ebbandi pettadam deniki.

  7. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నువ్వే చెప్పాలి . అసలు దీనిగురించి మాట్లాడే అర్హత , విషయ పరిజ్ఞానం నీకు లేదు . ఎవరేం మాట్లాడినా అలా మాట్లాడకూడదు అంటావ్ ఒక్కడు తప్ప. వాడిది మాత్రం నీకు చాలా బాగుంటుంది కదా? 

  8. Indian muslims also should come forward in big numbers in all parts of the country to condemn the Pahalgam attack, like all other sections of the Indian community. They need not fear anything.

  9. పవన్కళ్యాణ్ పాకిస్తాన్ ని ప్రేమించే / సమర్దించే వారిని ఉద్దేశించి మాట్లాడితే ముస్లిం లు ఎందుకు భయపడాలి?

    1. Pakistan ni Evaru preeminchledu, Samradhinchaledu. Atuvantappudu ee karu koothalenduku Visvnadha? Hinduvulaki undedi okka desamae ani kaaru koothalenduku. Aayana cheppadalachukunadi emiti pointblanka ga minorities ni target cheyyadamae. Repu dammuntae Andhralo ekkadinunchaina gelichi chupinchamanu chuddam.

  10. //దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరు ఉగ్రవాదులే అని అర్ధం వచ్చేలాగా//

    ఏమి మాట్లాడాడో రాసి ఉంటె బాగుండేది కదా!

    కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు, పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళను, దయచేసి పాకిస్తాన్ కి వెళ్లిపోండి అని అన్నాడు. దానికి ముసిలిమ్స్ బెదిరిపోవాల్సింది ఏముంది.

      1. //ఏదోదో కుశాడనుకుంటా..//

        నువ్వు కూసినదానికే నీకు క్లారిటీ లేదు. పోనీ ఆ మాటలో “దేశం లో ఉన్న అందరు ఉగ్రవాదులే అని అర్ధం వచ్చేలాగా ఎమన్నా ఉన్నదా!”

Comments are closed.