ప‌తాక‌స్థాయికి ప‌వ‌న్ కుల‌పిచ్చి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కుల‌పిచ్చి ప‌తాక స్థాయికి చేరింది. ఒక వైపు తాను మొద‌ట, చివ‌ర భార‌తీయుడిని అంటూ ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టి… అందుకు పూర్తి విరుద్ధంగా తాను కాపు కుల‌స్తుడిగా ఆవిష్క‌రించుకున్నారు. ఈ తిప్ప‌ల‌న్నీ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కుల‌పిచ్చి ప‌తాక స్థాయికి చేరింది. ఒక వైపు తాను మొద‌ట, చివ‌ర భార‌తీయుడిని అంటూ ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టి… అందుకు పూర్తి విరుద్ధంగా తాను కాపు కుల‌స్తుడిగా ఆవిష్క‌రించుకున్నారు. ఈ తిప్ప‌ల‌న్నీ కాపుల ఓట్ల కోస‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిస్థితి చివ‌రికి ఎలా త‌యార‌య్యిందంటే త‌న సామాజిక వ‌ర్గం ఓట్ల కోసం కూడా దేబ‌రించాల్సి వ‌స్తోంది.

ముఖ్యంగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై కాపుల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాతాళానికి దిగ‌జారార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా కాపుల రిజ‌ర్వేష‌న్‌పై జ‌గ‌న్ స్టాండ్‌ను ప‌వ‌న్ త‌ప్పు ప‌ట్టారు. వారాహి యాత్ర‌లో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కాపు రిజ‌ర్వేష‌న్‌పై ప‌వ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

” మొన్న ఎన్నికల్లో జగన్‌ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడు. జ‌గ‌న్ ధైర్యానికి నాకు ముచ్చ‌టేసింది. కానీ కాపులు ఆయ‌న‌కే ఓట్లేశారు. ఇందులో నా అభిమానులూ ఉన్నారు. 60 శాతం కాపులు వైసీపీకి, 30శాతం జనసేనకు ఓట్లు వేశారు. కాపులకు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌నని, ఛీ అని అంటున్న నాయ‌కుడు సీఎంగా ఉండాలా.. దళితుల పథకాలను ఎత్తేసిన వ్యక్తి సీఎంగా ఉండాలా? కులాల మధ్య గొడ‌వ‌లు సృష్టించి విడదీయడమే జగన్‌ ఎజెండా” అని ప‌వ‌న్ విమ‌ర్శించారు.

సీఎం జ‌గ‌న్‌పై ఇలాంటి వ్యాఖ్య‌ల‌తోనే ప‌వ‌న్ త‌న సొంత సామాజిక వ‌ర్గం దృష్టిలో కూడా ప‌లుచ‌న అయ్యారు. 2014లో తాను మ‌ద్ద‌తు ప‌లికిన చంద్ర‌బాబు కాపుల‌కు ఐదు శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి వారి ఓట్లు వేయించుకుని, చివ‌రికి మోసం చేశారు. కానీ ఎప్పుడూ చంద్ర‌బాబును ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌లేదు. కాపుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌శ్నించిన‌, దీక్ష‌కు దిగిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని పోలీసుల‌తో చిత‌క్కొట్టించారు. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  ఇదేం అన్యాయ‌మ‌ని ప్ర‌శ్నించ‌లేదు. అస‌లు ఆయ‌న ఏ క‌లుగులో దాక్కున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం త‌న చేతిలో లేద‌ని, వారి అభివృద్ధి కోసం భారీ మొత్తంలో నిధులు ఖ‌ర్చు చేస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ దృష్టిలో విల‌న్ అయ్యారు. కాపులను మోస‌గించిన నాయ‌కుడిగా చిత్రీక‌రించి, రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగించేందుకు ప‌వ‌న్ దిగ‌జారి మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ప‌దేప‌దే తాను కాపున‌ని చెప్పుకోవ‌డం వెనుక దురుద్దేశం ఏంటో ప‌వ‌నే చెప్పాలి. 

కులమ‌తాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేస్తాన‌ని ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ చెబుతుండ‌డం వ‌ల్లే ఈ ప్ర‌శ్న వేయాల్సి వ‌స్తోంది. చెప్పేవ‌న్నీ నీతులు, చేసేవ‌న్నీ కుల రాజ‌కీయాలు అనేందుకు తాజా ప‌వ‌న్ ప్ర‌సంగ‌మే నిద‌ర్శ‌నం. ప‌వ‌న్‌లో కుల‌పిచ్చి ప‌తాక‌స్థాయికి చేరింద‌నేందుకు ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ ఏం కావాలి?