జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మైక్ ఇస్తే చాలు.. తెగ రెచ్చిపోతుంటారు. గుంటూరు శేషేంద్రశర్మ, తిలక్, శ్రీశ్రీ తదితర మహాకవుల కవిత్వాన్ని వినిపిస్తూ, తానేదో గొప్ప పోరాట యోధుడిగా బిల్డప్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పొత్తు కుదిరిన తర్వాత జనసేన తరపున ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
ఖర్చులన్నీ తమ నెత్తినేసి, పవన్‌కల్యాణ్ మాత్రం రిలాక్ష్ అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో విశాఖలో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంలో, ఆ తర్వాత కొత్తగూడెం, తాజాగా చిలకలూరిపేటలో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభల్లో పవన్‌కల్యాణ్ పాల్గొనడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇంతకు మించి పవన్ బహిరంగ సభలు నిర్వహించిన ఎన్ని నెలలైందో చెప్పగలరా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పార్టీలో చేరికలు వుంటే, మంగళగిరి జనసేన కార్యాలయంలో వంద మందితో సమావేశం నిర్వహించి, మమ అనిపిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాగైతే జనసేన వల్ల తమకేంటి లాభమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమతో పొత్తుకు పవన్ ఎందుకు వెంపర్లాడారో ఇప్పుడు అర్థమవుతోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
పొత్తు వల్ల సభలు, సమావేశాల ఖర్చులన్నీ టీడీపీ పెట్టుకుంటుందని, అలాగే తాను ఈజీగా గెలవొచ్చనే ఏకైక లక్ష్యంతో తప్ప, సొంతంగా బలపడాలనే ఆలోచనే పవన్‌కు లేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసి వుంటే… ఈ పాటికి సభలు, వాటికి జనాన్ని తరలించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తమతో పొత్తు వల్ల పవన్‌కు ఆ ఖర్చులు లేకపోగా, అంతా మిగులే అని వారు అంటున్నారు.
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం
1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం
2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి
సుబ్రహ్మణ్య శర్మ
తల్లి
అమ్మాయమ్మ
భార్య /
జానకి
పిల్లలు
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి : విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
….. గుంటూరు శేషేంద్ర శర్మకవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా
వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)