జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం భలే గమ్మత్తుగా నడుస్తోంది. తనను ఎందుకు పార్ట్ టైం పొలిటికల్ లీడర్ అంటున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏదో చించుదాం.. పొడుస్తామని స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాదాపు సైలెంట్ అయిపోయాడు. తన పార్టీ వ్యక్తిగత ట్విట్టర్లో మంత్రులపై రోజు ఇష్టమొచ్చినట్లు ట్రీట్ చేసుకుంటూ కాలం కడుపుతున్నారు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో ఇదే రాజకీయం కాబోలు. కనీసం తన వ్యక్తిగత ట్వీట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేయాడం లేదంటే ఆ ట్వీట్లు ఎక్కడ నుండి వస్తున్నాయో ఆర్ధం అవుతోంది.
నిత్యం 70 పదుల వయసులో కూడా కొడుకు మీద భారం పెట్టకుండా అమరావతి టు హైదరాబాద్ తిరుగుతూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడును చూసైనా నేర్చుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్టర్ లో ట్వీట్ చేస్తేనే రాజకీయం అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ట్వీట్టర్ లో రాజకీయం నారా లోకేష్.. పవన్ కళ్యాణ్ ఇద్దురు ఇద్దరే.
రేపటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతుంది అంటూ ఊగిపోయి ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ అయిపోవడంతో క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ ఏదో వచ్చి తనకు ఇష్టం వచ్చినట్టు చెప్పి పోతుంటాడని అనుకుంటున్నారు. ఒకవైపు అమరావతి ఉద్యమం ఎటు కాకుండా వెళుతుంటే చంద్రబాబు నాయుడు తన సన్నిహితుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బస్సు యాత్రకు వెళ్లమని చెబుతున్న కూడా కదలట్లేదని తెలుస్తోంది. బహుశా కొద్దిగా రెస్ట్ తీసుకోని కదులుతారెమో.
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత మొత్తం భారం టీడీపీపై పెట్టి ఎన్నికల్లో వెళ్ళబోతున్నట్లు అర్థం అవుతుంది అందుకే కాబోలు నెలలో ఒకసారో లేకపోతే రెండు నెలల ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు గెస్ట్ గా వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి మళ్ళీ వెళ్లి తన పని తాను చేసుకొంటూన్నారు. ఎవరైనా ఏమైనా అంటే నాకు సినిమాలే గతి అని చెబుతున్నాడు.. సినిమాల డబ్బులతోనే రాజకీయం నడిపిస్తున్న అన్నప్పుడు మరి రోజూ ట్విట్టర్లోనూ, సోషల్ మీడియాలోను జనసేన పార్టీ కోసం విరాళాలు ఇవ్వండి అడగడం ఎందుకో మరి అంటూన్నారు విశ్లేషకులు.