వారెవ్వా పవన్.. డబ్బు కావాలి, టికెట్లు ఇవ్వరా?

ఎంత చెడ్డా రాజకీయ పార్టీలకు నిధులు అవసరం. సంపన్నుల నుంచి విరాళా స్వీకరించడం మీదనే ప్రధానంగా ఆధారపడి పనిచేస్తుంటాయి. అలాగే టికెట్ ఆశించే సంపన్నుల నుంచి కూడా పార్టీ ఫండ్ స్వీకరిస్తాయి. పార్టీలకు ఎవ్వరూ…

ఎంత చెడ్డా రాజకీయ పార్టీలకు నిధులు అవసరం. సంపన్నుల నుంచి విరాళా స్వీకరించడం మీదనే ప్రధానంగా ఆధారపడి పనిచేస్తుంటాయి. అలాగే టికెట్ ఆశించే సంపన్నుల నుంచి కూడా పార్టీ ఫండ్ స్వీకరిస్తాయి. పార్టీలకు ఎవ్వరూ ఊరకే విరాళాలు ఇవ్వరు. టికెట్ ఆశిస్తారు లేదా పార్టీ ద్వారా ఇతర ప్రయోజనాలు ఆశిస్తారు.

ఇక్కడ తమాషా ఏంటంటే.. పవన్ కల్యాణ్ తీరు చాలా భిన్నంగా ఉంది. ఆయనకు సంపన్నులు, పారిశ్రామికవేత్తలనుంచి విరాళాలు, చందాలు కోట్లలో కావాలి కానీ.. వారు మాత్రం ఆయనను టికెట్ అడగకూడదు అని అనుకుంటున్నారు. పార్టీకి భారీ మొత్తాల్లో విరాళాలు ఇచ్చిన పెద్దలు, ఫలానా చోట టికెట్ తమకు కావాలంటూ అడిగినందుకు పవన్ కల్యాణ్ వారి చెక్కులను తిప్పిపంపేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తొలి నుంచి కూడా విరాళాల మీద ఆధారపడి నడుస్తోంది. పవన్ కల్యాణ్ చాలా తరచుగా మా పార్టీ వద్ద డబ్బుల్లేవు అని, అలాగే, నా సినిమా సంపాదన నుంచి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నానని రకరకాల మాటలు వల్లిస్తుంటారు. అదే సమయంలో ‘పెద్దపెద్ద’  వాళ్లతో స్టార్ హోటళ్లలో లంచ్ భేటీలు, డిన్నర్ భేటీలు నిర్వహిస్తుంటారు. కులం పారిశ్రామికవేత్తలను పోగేసి వారినుంచి కోట్ల విరాళాలు ఆశిస్తుంటారు. ఇవన్నీ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇటీవలి వసూళ్ల పర్వంలో అనేక మంది ప్రముఖులు పవన్ కల్యాణ్ పార్టీకి భారీ మొత్తాల్లో చెక్కులు ఇచ్చారుట. 

కొన్నాళ్లు గడిచిన తర్వాత పెద్ద మొత్తాలు ఇచ్చిన వారంతా.. తమకు ఫలానా చోట టికెట్ కావాలి, పలానా నియోజకవర్గం కావాలి అని అడగడం మొదలెట్టారట. అసలే తెలుగుదేశంతో సీట్ల పంచాయతీ తెగకుండా.. తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో.. ఏయే సీట్లు వస్తాయో తెలియకుండా సతమతం అవుతున్న పవన్ కల్యాణ్ తాజాగా మంగళవారం నాడు ఏడుగురు ప్రముఖులు ఇచ్చిన చెక్కులను వెనక్కు పంపేశారుట.

తిప్పి పంపడం అనేది వారు సీట్లు అడిగినందుకు కాదని, అయితే.. తెదేపాతో సీట్ల పంచాయతీలో వారు అడిగిన స్థానాలు తమ పార్టీకి రాకపోవడం వల్లనేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీకి దక్కిన స్థానాల్లో అందిన విరాళాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. పైగా ఎటూ తాము అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పుకుంటున్నారు గనుక.. తిప్పి పంపిన చెక్కులు కూడా మళ్లీ వారికే వస్తాయని, సీటు లేకపోయినా పర్లేదు అని చెక్ వాపసు తీసుకోకుండా పార్టీకే దక్కే అవకాశం ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.