ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదని.. నేను దాదాపు 50 ఏళ్లు రాజకీయాలల్లో ఉన్నానని.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదని.. సంక్షేమం అభివృద్ధితో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాక్షించారు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసున్న ప్రభుత్వంపై, సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ లు విమర్శించడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. వారు ఎన్ని విమర్శలు చేసినా వారి అశీర్వాదంగానే తీసుకుంటామన్నారు.
అలాగే మాజీ మంత్రి నోటి దూల టీడీపీ నేత అయ్యన్న పై పెద్దిరెడ్డి మార్కు కౌంటర్ వేశారు. సీఎం వైయస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే బుద్ది చెబుతారని.. అయ్యన్నకు పోయేకాలం దాపురించిందన్ని అందుకే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ పై మీడియా ప్రశ్నించగా.. బీఆర్ఎస్ గురించి మాట్లాడానికి ఏమి లేదన్నారు.