రెండు రోజుల క్రితం బెంగళూరులో ఓ హోటల్‌లో రెండు రోజుల నాడు సంభవించిన బాంబు పేలుళ్లు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఇప్పుడీ ఘటనతో సంబంధాలున్న వ్యక్తి కడప జిల్లాలో ఉన్నాడనే వార్త అక్కడి ప్రజానీకం ఉలిక్కి పడేలా చేసింది. దీంతో కడప జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించడం గమనార్హం.
బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదుల కదలిక సమాచారం ఉండడంతోనే ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లె వద్ద టెర్రరిస్ట్‌గా అనుమానిస్తున్న సలీం అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పీఎఫ్ఐ సభ్యుడిగా భావిస్తున్న సలీంను చెర్లోపల్లెలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జేసీబీ ఓనర్‌కు సలీం ఫోన్‌లో మాట్లాడ్డం, ఎవరికీ అనుమానం రాకుండా తన కార్యకలాపాలను సాగిస్తుండడాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఇతనిపై రెండు లక్షల రూపాయల రివార్డ్ ఉంది. ఇదిలా వుండగా చెర్లోపల్లెలో ఒక ప్రార్థనా మందిరంలో సలీం తలదాచుకున్నట్టు తెలిసింది.