ఇన్ని రోజులు చంద్రబాబుకి ఏదైనా సమస్య వచ్చిందంటే టీడీపీ పార్టీ కంటేతన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుండేవారు. ఇప్పుడు పవన్‌ను వెనక్కు నెట్టి ముందుగా బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుకు సపోర్ట్ చేయడంతో చంద్రబాబు విషయంలో పవన్ కాస్తా వెనకపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 గా ఉన్న చంద్రబాబు అరెస్ట్ చేయడంపై పురందేశ్వరి స్పందిస్తూ.. 'ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది'. అంటూ ట్వీట్ చేసింది.
తాజా పురందేశ్వరి ట్వీట్‌తో తనకు చంద్రబాబుపై ఉన్న అభిమానం మొత్తం బయటపడింది. బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి సొంత పార్టీ ప్రయోజనల కంటే టీడీపీ పార్టీపై ప్రయోజనలు కాపాడుకుంటూ వస్తున్న పురందేశ్వరి తాజా ట్వీట్ బీజేపీ నేతలకు కొత్తగా అనిపించకపోవచ్చు.
ఏ పార్టీలో ఉన్న చంద్రబాబు కోసం పని చేసే వారు ప్రతి పార్టీలోను ఉంటారనేది అందరికి తెలిసిందే. తాజా పురందేశ్వరి ట్వీట్‌తో ఇకపై జనసేన అధినేత, ఎర్ర పార్టీ నేతలు, అపర మేధావులు అందరు ప్రభుత్వంపై విరుచుపడుతూ చంద్రబాబుకు సపోర్టుగా మాటలను గంటల వ్యవధిలోనే చుడబోతున్నాము.