సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.
మూడు వారాల క్రితం ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇస్తూ ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్దమని పేర్కొంది. దీంతో క్యాట్ ఉత్తర్వులను నిలపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయాగా క్యాట్ ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు సృష్టం చేసింది.
చంద్రబాబు హయాంలో నిఘా విభాగం అధికారిగా ఉన్న ఏబీ రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడారనే ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో అధికారంలో ఉండి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసి.. వారిని బ్లాక్మెయిల్ చేసి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని వైసీపీ ముఖ్య నేతల ఆరోపణ. మరోవైపు ఆయన ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఆయన యూనిఫామ్‌తో రిటైర్ అవుతారా లేదా? అనేది చూడాలి.