రోజా ఎక్కడ ఉన్నా రోజావే. ఆమె డ్యాన్స్ అంటే రెడీ అంటారు. మంత్రిగా ప్రస్తుతం ఉన్న రోజా విశాఖ టూర్ లో భాగంగా పాడేరు ఏజెన్సీలోని ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి లో టూరిజం వారి రిసోర్ట్స్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోజాకు గిరిజనుల నుంచి ఘన స్వాగతం లభించింది. వారి సంప్రదాయ నృత్యం అయిన ధింసా తో మంత్రిని ఆహ్వానించారు. ఆ డ్యాన్స్ చూడడంతో రోజా సైతం కాలు కదుపుతూ ధింసా నృత్యం చేశారు. ఆమె గిరిజనులతో కలసి సందడి చేశారు.
టూరిజంలో ఏపీ టాప్ గా ఉందని టెంపుల్ టూరిజం లో దేశంలోనే ఏపీకి మూడవ స్థానం లభించిందని రోజా చెప్పారు. ప్రభుత్వం ప్రైవేట్ పార్టనర్ షిప్ తో ఏపీలో భారీ టూరిజం ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆమె తెలిపారు.
ఏపీలో పర్యాటక కళ చాలా ఉందని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రోజా రాజకీయ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. 175కి మొత్తం 175 సీట్లూ తమవే అని అన్నారు. విపక్షాలకు ఆయాసం తప్ప ఎన్నికలో పోరాటలో మరేమీ మిగిలేది లేదని రోజా మార్క్ జోస్యం చెప్పారు.