తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైఎస్సార్సీపీ ఎస్సీ మహిళను అస్త్రంగా ప్రయోగిస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో అనిత విషయంలో వైఎస్సార్సీపీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. వైఎస్ జగన్, ఆయన భార్య, తల్లి, చెల్లిపై అనిత తరచూ అవాకులు చెవాకులు పేలుతుండడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం అసహనంగా ఉంది.
ఈ నేపథ్యంలో అనితకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు విశాఖ ప్రాంతానికి చెందిన రోజారాణి అనే నాయకురాలిని వైఎస్సార్సీపీ అస్త్రంగా వాడుతోంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకురాలిగా రోజారాణి వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎల్లో మీడియాధిపతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిత తన అలవాటు ప్రకారం జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి నాని తదితరులపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారామె.
అదే సూత్రాన్ని అనిత విషయంలో వర్తింపజేయాలని వైఎస్సార్సీపీ యాక్షన్‌కు దిగింది. అనిత ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ నేతల్ని దూషిస్తే చాలు వెంటనే రోజారాణి తెరపైకి వస్తోంది. రోజారాణి గత రెండు మీడియా సమావేశాల్లో అనితపై ప్రయోగించిన అసభ్య భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. రాయడానికి, ఉచ్ఛరించడానికి వీల్లేని దూషణలకు తెగబడ్డారామె.
“అనితా నీ చీకటి బతుకులు బయట పెడతాం. వగలాడి వంగలపూడి. అనిత టీడీపీ బ్రోకర్ , పాయకరావుపేట చింతామణి. బ్రోకర్ హౌస్ నడుపుకునే అనిత కుటుంబ విలువల గురించి మాట్లాడ్డం విడ్డూరం” రోజారాణి ఘాటు విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసేందుకు అనితను ప్రయోగించిన టీడీపీ, ఇప్పుడామెను ప్రత్యర్థులు బజారుకీడిస్తుంటే మద్దతుగా నిలబడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నిరోజులుగా రోజారాణి తిట్లకు అనిత విలవిలలాడుతోంది. ఆమె మానిసక వేదనను టీడీపీ తీసుకునే పరిస్థితి లేదు. అనిత వ్యక్తిత్వాన్ని నీచంగా తిడుతుంటే ఆస్వాదిస్తున్నారే తప్ప….ఇదేమని ప్రశ్నిస్తున్న వాళ్లే లేరు.
ఎందుకంటే అనితతో మొదట మొదలు పెట్టింది వాళ్లే. అనిత ఇప్పటికైనా తన వైఖరిపై పునరాలోచన చేసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుతున్నారు. అనితను టార్గెట్ చేసే క్రమంలో అవాంఛనీయమైన రోజారాణి దూషణలను వైఎస్సార్సీపీ ప్రోత్సహించకపోవడం మంచింది. ఎందుకంటే రేపు టీడీపీ నుంచి రోజారాణి లాంటి వారు మరొకరు పుట్టుకొస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో దళిత మహిళా నేతలే పావులు కావడం గమనార్హం.