పోస్టల్ బ్యాలెట్ వార్ లోకి టీడీపీ నేత ఎంట్రీ!

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో వార్ సాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్లపై దేశంలో ఉన్న నిబంధనలు కాకుండా ఏపీ వరకూ ప్రత్యేక రూల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ వెళ్ళింది. ఈ మేరకు హైకోర్టు…

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో వార్ సాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్లపై దేశంలో ఉన్న నిబంధనలు కాకుండా ఏపీ వరకూ ప్రత్యేక రూల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ వెళ్ళింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

సుప్రీం కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిన నేపధ్యంలోన విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో   కేవియట్ దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. వైసీపీ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు.

సడెన్ గా వెలగపూడి ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ వర్గాలు దీని మీదనే మాట్లాడుకుంటున్నాయి. వెలగపూడితో అధినాయకత్వమే ఇలా కేవియట్ వేయిస్తోంది అంటున్నారు. సుప్రీం కోర్టుకి వెళ్తే మెరిట్స్ చూసి ఏమైనా డెసిషన్ వైసీపీకి సానుకూలంగా రావచ్చు అన్న చర్చ న్యాయ వర్గాలలో  ఉంది.

దాంతోనే వెలగపూడి కేవియట్ ని దాఖలు చేశారు అని అంటున్నారు. అయితే రూల్ ఈజ్ రూల్ అన్న విధానం కాబట్టి తమ వైపే న్యాయం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. దేశంలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుకు ఏ రకమైన రూల్స్ ని ఫ్రేం చేశారో అవే రూల్స్ ని ఏపీలో అమలు చేయాలని కోరుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.