శత్రుచర్ల కుటుంబాన్ని సైడ్‌ చేస్తున్నారా…?

మాజీ మంత్రి సీనియర్‌ నేత శత్రుచర్ల విజయరామరాజు శాసనమండలి సభ్యత్వం ఈ మార్చి నెలతో పూర్తి అవుతోంది. ఆయన వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు.  Advertisement అదే సమయంలో ఎస్‌టి రిజర్వుడ్‌…

మాజీ మంత్రి సీనియర్‌ నేత శత్రుచర్ల విజయరామరాజు శాసనమండలి సభ్యత్వం ఈ మార్చి నెలతో పూర్తి అవుతోంది. ఆయన వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. 

అదే సమయంలో ఎస్‌టి రిజర్వుడ్‌ సీటు అయిన కురుపాం నుంచి తన తమ్ముడు దివంగత చంద్రశేఖరరాజు కుమార్తె పల్లవీరాజ్‌ను నిలబెట్టాలని చూస్తున్నారు. కురుపాంలో వైసీపీ బలంగా ఉంది. దాంతో పాటు టీడీపీలో వర్గ పోరు ఉంది. దీంతో చంద్రబాబు పనిచేసే వారికి సమర్ధులకు టిక్కెట్‌ ఇవ్వాలనుకుంటున్నారుట. 

పల్లవీరాజ్‌కు టిక్కెట్‌ ఇస్తే పార్టీలోని మిగిలిన వారు ఎంతమేరకు సహకరిస్తారన్నది కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక శత్రుచర్లకు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రెండు అవకాశాలు ఇచ్చామని, ఆయనకు రాజకీయ రిటైర్‌మెంట్‌ తప్ప మరేదీ పార్టీ ఇవ్వదని అంటున్నారు. 

తాజాగా జరిగిన పార్వతీపురం జిల్లా సమీక్షలో సైతం శత్రుచర్లను పక్కన పెట్టేశారని అంటున్నారు. పల్లవీరాజ్‌ సైతం వారసత్వం పేరుతో టిక్కెట్‌ కోరుకుంటున్నారని జనంలో ఉంటేనే పార్టీ టిక్కెట్‌ అని అధినాయకత్వం కచ్చితంగా చెబుతోంది. 

మొత్తానికి చూస్తే శత్రుచర్లకు సొంత పార్టీలో శత్రువులు ఎక్కువ అయ్యారని, అలాగే చంద్రబాబు దయ కూడా గతంతో  మాదిరిగా లేకుండా పోయిందని అంటున్నారు. మరి ఆయన ఎన్నికల వేళకు సైకిల్‌ దిగేస్తారా అన్న సందేహాలూ వస్తున్నాయట. అయితే వైసీపీ వైపా లేక జనసేన వైపా అన్నదే చర్చలో ఉన్న విషయం.