తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై గురువారం రచ్చ జరిగింది. ఏకంగా జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్‌రాయల్ నేతృత్వంలో నగరంలోని ఒక హోటల్లో టీడీపీ ఆశావహులు, ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి పవన్‌పై తిరుగుబాటు బావుగా ఎగుర వేశారు. మీడియాకు లీకులు ఇచ్చి, మరీ జనసేనను వీధిన పడేశారు.
పవన్‌కల్యాణ్ కోసం ప్రాణాలైనా ఆర్పిస్తామంటూ ఇంత కాలం టీవీల్లో ప్రగల్భాలు పలుకుతూ, ఇప్పుడు తమకు టికెట్ దక్కకపోయే సరికి నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. తిరుపతి స్థానికుల ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఆరణి శ్రీనివాసుల్ని కూటమిపై రుద్దారంటూ పవన్‌కల్యాణ్‌పై నిన్నంతా పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులంటూ టీడీపీ నేతలతో కలిసి వీళ్లిద్దరూ పట్టణమంతా ప్లెక్సీలు వేయించారు.
దీనికి కొనసాగింపుగా ఇవాళ తిరుపతిలో ఒక కల్యాణ్ మండపంలో స్థానికుల ఆత్మీయ సమావేశం నిర్వహించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అధిష్టానాలు తిరుపతి నేతలపై సీరియస్ అయ్యినట్టు సమాచారం. దీంతో స్థానికుల ఆత్మీయ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే పసుపులేటి హరిప్రసాద్‌పై జనసేన పెద్దలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో యూ టర్న్ తీసుకున్నారు.
పవన్‌కల్యాణ్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ శిరసా వహించాలని ఆయన కోరారు. ఆ వీడియోలో ఏముందంటే… పదేళ్లుగా పవన్‌తో కలిసి నడుస్తున్నామన్నారు. పవన్ మాటల్ని వేదంగా భావించాలని కోరారు. తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల్ని పవన్ ప్రకటించారన్నారు. పవన్ మాటల్ని వేదంగా భావించి ఆరణిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నట్టు ఆ వీడియోలో పసుపులేటి చెప్పడం విశేషం.
జనసేన నేతలే వివాదం సృష్టించడం చర్చనీయాంశమైంది. అధిష్టానం ఆగ్రహంతో దిగొచ్చి, మళ్లీ దిద్దుబాబు చర్యలు చేపట్టారు. నిన్నంతా పవన్‌ను తిట్టి, నేడు భయంతో మాట మార్చడం వారికే చెల్లింది.