ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు స్ప‌ష్ట‌త‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ్డా పిఠాపురంలో శుక్ర‌వారం (నేడు) మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగు పెట్ట‌నున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత మొద‌టిసారి జ‌గ‌న్ అక్క‌డికి వెళ్ల‌నున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు తేలిపోనుంది.…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ్డా పిఠాపురంలో శుక్ర‌వారం (నేడు) మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగు పెట్ట‌నున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత మొద‌టిసారి జ‌గ‌న్ అక్క‌డికి వెళ్ల‌నున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు తేలిపోనుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు, అలాగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్‌, అలాగే వైసీపీ నాయ‌కులంతా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప్ర‌ధానంగా టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌ను ఎక్కువ‌గా టార్గెట్ చేయ‌డం వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ‌తీసేంద‌నే అభిప్రాయానికి జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఇక‌పై ప‌వ‌న్ గురించి ఎవ‌రూ మాట్లాడొద్ద‌నే నిర్ణ‌యానికి జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ముఖ్య నాయ‌కులు నిర్ణ‌యించార‌ని తెలిసింది. అందుకే పిఠాపురంలో ఇవాళ్టి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఏలేరు వ‌ర‌ద పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని ఊళ్ల‌ను ముంచెత్తింది. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తారు. బాధితుల‌తో ఆయ‌న మాట్లాడి, వాళ్ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుంటారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడ్తారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మాత్ర‌మే టార్గెట్ చేస్తారా? లేక ప‌వ‌న్ అడ్డాకు వెళ్లిన కార‌ణంగా, ఆయ‌న‌పై కూడా విమ‌ర్శ‌లు చేస్తారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌వ‌న్‌పై విధానాల ప‌రంగా ఒక‌ట్రెండ్ విమ‌ర్శ‌లు చేయొచ్చు, చేయ‌క‌పోవ‌చ్చ‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ గ‌తంలో మాదిరిగా ఇక‌పై ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేసే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని అంటున్నారు. జ‌గ‌న్ నోటిని అదుపులో పెట్ట‌కుంటే, మిగిలిన నాయ‌కులు కూడా జాగ్ర‌త్త‌గా మాట్లాడ్తార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

21 Replies to “ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు స్ప‌ష్ట‌త‌!”

  1. 4 పెళ్ళాలు అన్నందుకు …తప్పై పొయింది… అని పవన్ కాళ్ళు పట్టుకుంటె పొలా అంటావా?

  2. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, ప్రతిపక్ష పార్టీ విమర్శలు ప్రభుత్వ విధానాల మీద ఉండాలి, వ్యక్తుల మీద కాదు.

  3. అసెంబ్లీ లో, వీధుల్లో అదే మాట పవన్ వ్యక్తిగతం గురించే జగన్ నోటెంట. ఇప్పుడు ఎందుకు మాట్లాడడో? భయమా? మర్యాదా?

  4. ఏదైనా సమస్య ఉంటె.. ప్రతిపక్షం ముందుండాలి..

    నిన్న మొన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిఠాపురం లో పర్యటించేసాక.. ఈ ముండమోపి తీరిగ్గా ఇప్పుడు వెళుతున్నాడు..

    వెళ్లి పీకేది కూడా ఏమీ ఉండదు.. మూడు పెళ్లిళ్లు పెళ్ళాలు అమ్మఒడి అంటూ తింగరి చేష్టలు చేసి మళ్ళీ మీడియా కి దొరికిపోతాడు..

    వీడొక రిజెక్ట్డ్ పీస్ .. ప్రస్తుతం కామెడీ వేషాలు వేసుకుని బతుకుతున్నాడు..

    ఇప్పుడు వీడి వైఖరి ఎవడడిగాడు.. వీడి వైఖరే వీడికి చేటు..

  5. తినమరిగిన నోరు, తిరగ మరిగిన కాలు ఊరికే ఉండవని సామెత. అలాగే వంకర బుద్ధి కలిగిన వెధవ కూడా. వరద సమయంలో సహాయం చేస్తే మర్యాద వస్తుంది. అంతా అయిపోయాక పరామర్శకు వెళితే చేతికి చిప్ప వస్తుంది.

Comments are closed.