ఎట్టకేలకు భూమనను గుర్తించిన జగన్!

ఎట్టకేలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ గుర్తించారు. టీటీడీ చైర్మన్ గా ఆయ‌న్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఈనెల 12 తో…

ఎట్టకేలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ గుర్తించారు. టీటీడీ చైర్మన్ గా ఆయ‌న్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఈనెల 12 తో ముగియ‌నుండంతో టీడీపీ ఛైర్మ‌న్‌గా తిరుప‌తి ఎమ్మెల్యే క‌రుణాక‌ర్ రెడ్డి నియామించారు. 

గ‌తంలో వైయ‌స్ఆర్ సీఎం ఉన్న‌ప్పుడు కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయ‌న ప‌ద‌వి కాలంలో టీటీడీలో పెద్ద ఎత్తున మార్పుల‌తో స‌హా ఎటువంటి వివాదాల‌కు చోటు లేకుండా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. దాంతో వివాదాల‌కు దూరంగా ఉంటూ టీటీడీ అభివృధి గురించే అలోచించే వ్యక్తినే ఛైర్మ‌న్‌గా నియామించ‌డంతో వైసీపీ శ్రేణులు కూడా అనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం జ‌గ‌న్ బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా తొలిసారి ప్రభుత్వం నియమించింది. తిరిగి 2021 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఆయనకే రెండోసారి టీటీడీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు దఫాలుగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.