పిచ్చి కుదిరితే.. రోకలి తలకు చుట్టమన్నాడుట!

వెనకటికి ఒక ప్రబుద్ధుడు పిచ్చి కుదిరితే రోకలి తలకు చుట్టమన్నాడని సామెత. ఇప్పుడు లడ్డూల విక్రయం విషయంలో టీటీడీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. అదనపు లడ్డూలు కోరుకునే భక్తులు తమ దర్శనం…

వెనకటికి ఒక ప్రబుద్ధుడు పిచ్చి కుదిరితే రోకలి తలకు చుట్టమన్నాడని సామెత. ఇప్పుడు లడ్డూల విక్రయం విషయంలో టీటీడీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. అదనపు లడ్డూలు కోరుకునే భక్తులు తమ దర్శనం టోకెన్ తో పాటు, ఆధార్ కార్డు కూడా తీసుకు వెళ్లాలట.

ఒకవేళ రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి దర్శనం పొందలేకపోయిన భక్తులు ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలు తీసుకోవచ్చునట. లడ్డూల విక్రయంలో దళారీలను అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారట. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించే ఏర్పాటు చేయలేని టీటీడీ తమ వైఫల్యాన్ని, ఇలా కవర్ చేసుకుంటున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తిరుమలకు వెళ్లిన భక్తుడు లడ్డూ ప్రసాదం తెచ్చుకుని.. దాన్ని ఎంతో పవిత్రంగా భావించి నలుగురికీ పంచిపెట్టడం ఆనవాయితీ. అయితే భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించే ఉద్దేశంతో అత్యంత ఆధునికమైన పోటును ఆలయం వెలుపల ఏర్పాటుచేశారు. అప్పటినుంచి అదనపు లడ్డూలు కోరుకునే వారికి రూ.50 వంతున అందిస్తాం అని ప్రకటించారు. ఎన్ని లడ్డూలు కావలిస్తే అన్ని తీసుకోవచ్చునని కూడా ప్రకటించారు.

తర్వాతి కాలంలో లడ్డూల అమ్మకాలు పెరిగాయి. అదే విధంగా కొరత కూడా ఏర్పడింది. క్రమంగా భక్తులకు ఇచ్చే అదనపు లడ్డూల కోటాను తగ్గిస్తూ వచ్చారు. ‘ఎన్ని కావాలంటే అన్ని’ అనేది కాస్తా ఒక భక్తుడికి 5 మాత్రమే, 2 మాత్రమే అంటూ మారిపోతూ వచ్చింది. ఇప్పుడు తిరుమలకు వచ్చి.. దర్శనం చేసుకోవడం సాధ్యం కాకపోయిన భక్తులకు ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు మాత్రం ఇస్తాం అంటున్నారు. దర్శనం కూడా దక్కని అభాగ్యుడైన భక్తుడికి లడ్డూకూడా కోతపెట్టే ఏర్పాటు అన్నమాట!

ఇదంతా లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దళారీలను నియంత్రించడానికే అని టీటీడీ చెబుతున్నది. అత్యంత ఆధునిక పోటు నిర్మించిన తర్వాత కూడా.. భక్తుల అవసరాలకు రద్దీకి తగినన్ని లడ్డూలు తయారు చేయకుండా.. ఆ చేతగానితనాన్ని కప్పెట్టుకోవడానికి.. బ్లాక్ మార్కెట్ అరికట్టడం అనే ముసుగు వేస్తున్నారనేది జనం అభిప్రాయం. ఒక లడ్డూ ధర యాభై రూపాయలు పెట్టిన తర్వాత.. ఇంకా బ్లాక్ మార్కెట్ ఏముంటుంది అని కూడా పలువురు అంటున్నారు.

29 Replies to “పిచ్చి కుదిరితే.. రోకలి తలకు చుట్టమన్నాడుట!”

  1. దర్శనం చేసుకున్న వాళ్లకు మనిషికి 4నుండి 6 లడ్డులు ఇస్తారు దర్శనం చేసుకోకుండా కొనుకున్న వాళ్లకు మాత్రమే ఆధార్ తో లడ్డులు అని చెప్పారు మీరు అది ఏం రాయలేదు

  2. అరే నువు గ్రేట్ ఆంధ్రా కాదురా జగన్ గాడి గ్రేట్ అంద అభినివి జగన్ గాడే వేస్ట్ కొడుకు అనుకుంటే మీరు అంతా కంటె వేస్ట్ కొడుకులు

  3. శ్రీవారి ప్రసాదాన్ని ఓట్లు కోసం పంచి పెట్టడం కాకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముకున్నారు, శ్రీవారి ప్రసాదానికి ఉన్న విలువ క్రిస్టియన్ మతస్తుడు అయిన జగన్ రెడ్డికి ఎలా తెలుస్తుంది శ్రీవారి ప్రసాదం తక్కువగా దొరికితేనే దానికి ఉన్న విలువ అలాగే ఉంటుంది.

    1. అన్నం కూడా ఎక్కువ రేట్ కీ దొరికితేనే రైతు కీ విలువ అన్న క్యాంటీన్ లు ఎందుకు ఇక…

      కామెడీ గా ఉందా

      ఎవరికి కావాల్సినన్ని లడ్డూ లు కౌంటర్ లొ దొరికితే ఇంకా దళారిలు ఏక్కడ ఎక్కువ రేట్ కీ అమ్ముతారు…

      తక్కువ ఇస్తేనే దళారులు నల్ల మార్కెట్ పెరుగుతాది

      తిరుపతి లో పచ్చ మంద ని దించుతారు ఐతే ఇదే కధ ప్లాన్

      1. అది ఏమైనా స్వీట్ షాప్ లో దొరికే మామూలు లడ్డు కాదు రా లబ్బే అడిగినన్ని ఇవ్వటానికి, శ్రీవారి లడ్డుకి విలువ లేకుండా చేసి,TTD ని భ్రష్టు పట్టించిన దరిద్రులు రా మీరు.సి గ్గు లేకుండా ఇంకా కౌంటర్ వేస్తున్నవా? … పింజారి వెధవా.

        అన్నా కాంటీన్ కి / తిరుపతి లడ్డు కి తేడా తెలియని ఇంత వెర్రి పు లు ఏంటి రా మీరు .

        1. Orei labbe anduke ga kotta ga potu pettaru

          Okati istene prasadam aa… Korinanni ivvakudadha…

          Dalari vyavasta penchi posinchadame ippati TTD batch lakshyam anukunta…

          Anduke dalari vyavasta ni encourage chesela undhi ee nirvakam…

          Tirumala gudi ki vellaleni chala Mandi ki tirumala velli vachina vallu panchutaru… Devudi prasadam andariki andakunda chese kutra ra nilanti labbe gallu daniki support

      2. ఒరేయ్ గొఱ్ఱె ఎదవ.. అన్నా క్యాంటీన్ పెట్టడం వలన హోటల్స్ లో బేరాలు పోతున్నాయి.. పేదవాడి కి అసలు ఎందుకు అన్నం పెట్టాలి అనేట్టు ఉన్నావ్ కదరా జఫ్ఫా గా

  4. తిరుమలలో శ్రీవారి ప్రసాదజం లడ్డులు పంపిణీలో కోత విధించడం ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఆపడిస్తారు. కార్యనిర్వాహనాధికారిగారు మీరు కొన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకోండి. అక్కడ కొంత బజానాబృందం లేనిపోని సలహాలు ఇస్తారు. ఇప్పటివరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చినది. ఇది భక్తులను నిరాశ పరుస్తుంది. ఓమ్ నమో వెంకటేశయా 🙏

  5. ఎలాగో ఈ-హుండీ అని పెట్టి ఆన్లైన్ లో కానుకలు సమర్పించే వెసులుబాటు ఉంది కదా.. అలాగే ఆన్లైన్ లోనే లడ్డు కూడా ఇంటికి పంపించే ప్రక్రియ పెడితే పోతుంది.. దైవం.. ఆకలి.. సర్వాంతర్యామి…

  6. ఔరా రోగ్రెట్ ఆంధ్రా… ఏనాడైనా ఆ జలగడు నాన దరిద్రం చేసిన తిరుపతి గురించి క్షుణ్ణంగా ఒక ఆర్టికల్ రాశావ.. వాడు చేసిన దరిద్రం చెప్పాలంటే కనీసం ఒక 10 పేజీలు రాయొచ్చు.. తెలుసు కానీ నువ్వు రాయవు.. అదే నీ బానిసత్వం !! తిరుపతి అన్నప్రసాదాన్ని కూడా కంపు చేసిన ఘనుడు రా ఆ జగ్గడు.. అందుకే భ్రష్టు పట్టి పోయాడు… నీకు నిజంగా తిరుపతి పై చిత్తశుద్ధి ఉంటే వాడి చండాలాలను ఒక పెద్ద ఆర్టికల్ గా రాసి పెట్టు

  7. ఒరే ఎర్రి హూక్. 20-30 లడ్డూలు కొని బయట మార్కెట్ లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్న ప్రబుద్ధులు ఉన్నారు రా ఎదవా. అందుకే తగ్గించారు. చాలా మంది దర్శనం కోసం కాకుండా కేవలం లడ్డూలు కొనుక్కుని వెళ్ళి అమ్ముకుంటున్నారని తెలిసే తి.తి.దే. ఈ కొత్త నియమం పెట్టింది. నిజమైన భక్తుడైతే దేవుడి ప్రసాదం అని రెండు లడ్డూలతో తృప్తి పడతాడు. మీ లాంటి లూటీ నాయాళ్ళు అయితే ఒకే రోజులో ఇరవై ముఫ్ఫై సార్లు తిరిగి ఓ యాభై లడ్డూలు సేకరించి అమ్ముకుంటారనే ఆధార్ నియమం పెట్టారు. నీ లాంటి గొర్రె భక్తుడికి ఈ విషయం జీర్ణం కావడం లేదనుకుంటా. జగన్ గాడు దేవుడి కొండ పైన చేసిన దరిద్రాలు ఒక్కోటీ సరిచేయబడుతున్నాయి.

Comments are closed.