కూటమిలో కండువాల పంచాయితీ!

అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య స్నేహబంధం ఎలా ఉన్నదంటే… పరస్పరం కలబడి కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం దొరక్కపోతుందా అని వెతుకులాడుతున్నట్లుగా ఉంది. ఒకరంటే ఒకరికి పొసగదు.. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం…

అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య స్నేహబంధం ఎలా ఉన్నదంటే… పరస్పరం కలబడి కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం దొరక్కపోతుందా అని వెతుకులాడుతున్నట్లుగా ఉంది. ఒకరంటే ఒకరికి పొసగదు.. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం లేదు ఒకరి ఆధిపత్యం పట్ల మరొకరికి గౌరవం లేదు.. కారణం కనిపిస్తే చాలు కలబడి కట్టుకోవాలనే ధోరణిలోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారు.

తాజాగా ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల కార్యకర్తలతో అవగాహన సదస్సు నిర్వహించిన సందర్భంలో జనసేన తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగడం అందుకు నిదర్శనం.

ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ స్వయంగా హాజరయ్యారు. అయితే మూడు పార్టీలకు చెందిన కండువాలను వేసుకోకుండా కేవలం పచ్చ కండువా వేసుకుని వస్తే కూటమి అభ్యర్థి ఎలా అవుతారంటూ జనసేన కార్యకర్తలు పేరాబత్తులను నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఎన్నికలలో అందరి మద్దతు కూడగట్టుకోవడం అవసరం గనుక కనీసం ఆ పర్వం ముగిసే వరకైనా పేరాబతుల రాజశేఖర్ కాస్త లౌక్యంగా ఉంటే పోయేది. తనను నిలదీసిన వెంటనే బిజెపి, జనసేన కండువాలను కూడా భుజం మీద వేసుకొని ఉంటే చాలా గౌరవంగా ఉండేది. అవతలి వారి ఈగో కూడా సంతృప్తి చెంది ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన తరపు తెలుగుదేశం కార్యకర్తలు వాదులాటకు దిగడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.

కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం మాత్రమే కాదు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో కూటమి పార్టీల మధ్య సయోధ్య పక్కాగా ఏం లేదు! ఇసుక అక్రమ దందాలలో గాని, లిక్కర్ వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకునే వ్యవహారాల్లో గాని తెలుగుదేశం నాయకులే అధికంగా లబ్ధి పొందుతున్నారు, దండుకుంటున్నారని కూటమిలోని ఇతర పార్టీల వారికి అసంతృప్తి ఉంది. పలుచోట్ల వారు బయటపడకపోయినప్పటికీ ప్రధానంగా జనసేన, తెలుగుదేశం మధ్య ద్వేషభావం ఏర్పడుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకునే మార్గాలన్నీ తెలుగుదేశం వారు మాత్రమే వాడుకుంటున్నారని, తమకు ఏమీ దక్కడం లేదని వారు అసంతృప్తి చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కూడా కూటమి పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం లేకుండా పోయింది.

అలాంటి పరిస్థితులకు పరాకాష్ట అన్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ వచ్చిన కార్యక్రమంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం కలబడడం గమనార్హం. ప్రస్తుతం ఎన్నికలలో నెగ్గవలసిన అవసరం పేరాబత్తులదే గనుక ఆయనే కొంచెం తగ్గి ఉండాలని ప్రజలంటున్నారు.

జనసేన, బిజెపి నాయకులు అందరి మద్దతును కూడగట్టి ఎన్నికలవేళ వారి సహాయాన్ని కూడా పొందడం తెలుగుదేశానికి తప్పనిసరి అని, ఆ ఆ పర్వం మొత్తం పూర్తయ్యేదాకా కొద్దిగా సంయమనం పాటించాలని పేరాబత్తులకు పలువురు హితోపదేశం చేస్తున్నారు.

11 Replies to “కూటమిలో కండువాల పంచాయితీ!”

  1. వాల్లు కొట్టుకుంటూ ఉంటే నువ్వు సంతోషపడుతునట్టున్నావు, కానీ అదే నీ కొంప ముంచుతుందేమో చూసుకో, వారిద్దరూ కలిసి ఉంటే వైసిపి ప్రతిపక్షంలో ఉంది అని చెప్పుకోవటానికి ఉంటుంది, వాళ్ళు విడిపోతే జనసేనా రెండో స్థానానికి వస్తుంది, అప్పుడు వైసిపి సోదిలో లేకుండా పోతుంది…ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు. నీ మనుగడ ఉండాలంటే వాళ్ళు కలిసి ఉండాలని కోరుకో.

    1. అదేంటి మనం ఒక్క రెండేళ్లు కళ్ళు మూసుకుంటే మల్ల మా అన్నయ్య సిఎం అయిపోవచ్చు అని కదా మనం అనుకుంటున్నాం

      1. రెండుఏళ్ళు కాదు రెండు దశాబ్దాలు కళ్ళు మూసుకున్న వాడు మళ్ళీ గెలవాడు

  2. వాళ్లలో వాళ్ళకి పడక కొన్ని ఓట్లు వైసీపీ కి పడొచ్చు కానీ సింగల్ సింహానికి అభిమానం తో ఎవరు ఓటు వెయ్యరు

Comments are closed.