పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి రాధ!

దివంగత వంగవీటి మోహన రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా కృష్ణ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. న‌ర్సాపురానికి చెందిన యువ‌తితో ఆయ‌న వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఈ నెల 19న నర్సాపురంలో…

దివంగత వంగవీటి మోహన రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా కృష్ణ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. న‌ర్సాపురానికి చెందిన యువ‌తితో ఆయ‌న వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇన్నాళ్లు పెళ్లి గురించి అలోచ‌న చేయ‌ని రాధా మొత్తానికి త‌న మిత్రుడికి ద‌గ్గ‌ర బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. రాధా పెళ్లి వార్త తెలిసిన వంగవీటి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. పొలిటికల్‌ ఫ్యామిలీలో ఉన్నా వంగవీటి రాధా నలబై ఏళ్లు దాటిన‌ ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. చివరికి ఇప్పుడు ఓ తోడు కోరుకున్నారు. 

కాగా వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అదృష్టం కలిసిరాలేదు. ఎన్నిక‌ల ముందు పార్టీలు మారుతు తాను రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈసారి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ల‌ని ఆలోచిస్తున్నా ఏ పార్టీ నుండి నిల‌బ‌డుతారో ఎన్నిక‌ల వ‌ర‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా జ‌న‌సేన‌తో తిరుగుతున్నారు.