పరువు దావాలు చిత్రంగా ఉంటాయి. పరువుని అసలు నగదుతో తూచడమే గొప్ప తమాషాగా ఉంటుంది. పరువు ఎంత అంటే ఏమి చెప్పాలి. అయితే ఏదో ఒక పెద్ద నంబర్ వేసి పరువు నష్టం దావాలు ప్రత్యర్ధులకు పంపించడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ పరువు దావాలలో గెలిచిన వారికి ఓడిన వారు చిన్న సారీతో చెప్పి కధ ముగిస్తారు. అంతే తప్ప పరువు బరువుని నగదుతో తూచి ప్రతీ నయాపైసా ఇవ్వరు.
ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల విషయంలో తన మీద కుట్ర చేశారంటూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు పేరుని ఎంపీ మీడియా ద్వారా చెప్పి ఘాటైన ఆరోపణలు చేశారు. దానికి ప్రతిగా విజయ్ పాత్రుడు లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యారు.
తాను ఇలాంటి పనులు ఎందుకు చేస్తానని తన వెర్షన్ తాను చెప్పుకున్నారు. తనకు మాధవ్ తో అసలు పరిచయమే లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
అనవసరంగా తన మీద విమర్శలు చేసి తన పరువుకు మాధవ్ భంగం కలిగించాడని పేర్కొంటూ విజయ్ పాత్రుడు యాభై లక్షల రూపాయలకు పరువు నష్టం దావాను వేశారు. ఈ మేరకు విజయ్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. మాధవ్ నగ్న వీడియోలను తాను మార్ఫింగ్ చేయడం జరిగే పనేనా అని కూడా విజయ్ నిలదీశారు.
ఆయన నగ్న వీడియోలు తామంతా చూసి తరించడానికి ఆయన ఏమైనా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూసా అని ప్రశ్నించారు. ఇక తన మీద అనవసరంగా నోరు పారేసుకున్నారంటూ జూనియర్ అయ్యన్న గుస్సా అవుతున్నారు.
అందుకే ఆయన యాభై లక్షల రూపాయలకు పరువు దావా వేశారు. దీని మీద గోరంట్ల రియాక్షన్ ఏంటో చూడాలి. విజయ్ పాత్రుడు పరువు బరువును ఆయన ఎలా భరాయిస్తారో.