సోషల్ మీడియాలో విజయసాయి పంచ్ లకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన పంచ్ లతో చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడుతుంటారు విజయసాయి. తన స్టేట్ మెంట్స్ తో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ చేస్తుంటారు. ఈసారి కూడా మరో అదిరిపోయే పంచ్ తో వచ్చారు విజయసాయి. ఈసారి ఆయన సెటైర్ మహానాడుపై పడింది.
“చివరాఖరికి మహానాడు మనోవేదన ఏంటంటే: 2024లో కూడా T తూర్పు తిరిగి, D దణ్ణం, P పెట్టుకోవడమే.” ఇలా మహానాడుకు ముక్తాయింపు ఇచ్చారు విజయసాయి. టీడీపీకి సరికొత్త భాష్యం చెప్పారు. మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనిందతో సాగిందని ఎద్దేవా చేశారు.
“పార్టీ వ్యవస్థాపక దినం అనేది ఒక ముఖ్యఘట్టం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సంక్షేమం పైన చర్చలు జరుపుతారు ఎవరైనా. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం చూస్తుంటాం. గెలుపు అసంభవమని అర్థమైంది కాబట్టే ప్రయోజనకర సమీక్షలు లేకుండా ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడును జోకర్ల సభలా మార్చాడు బాబు.”
ఇలా భారీగా జరిగిన సభను, జోకర్ల సభగా మార్చేశారు విజయసాయి. పసుపు-కుంకుమ పేరుతో తాయిలాలు పంచితే ఎన్నికల్లో గెలుస్తానని బాబు భ్రమపడ్డారని, ఎన్ని పంచినా ప్రజలు ఉప్పు-కారం పెట్టారని, బాబుకు ఇంకా ఆ మంట తగ్గినట్టు లేదంటూ సెటైర్ వేశారు విజయసాయి.