చిరంజీవికి సాయిరెడ్డి కౌంట‌ర్‌!

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు ఆయనకు కౌంటర్లు ఇవ్వగా తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. చిరంజీవి పేరు ఎత్తకుండానే ట్విట్టర్ వేదిక ఆయన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.…

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు ఆయనకు కౌంటర్లు ఇవ్వగా తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. చిరంజీవి పేరు ఎత్తకుండానే ట్విట్టర్ వేదిక ఆయన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.

సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లంటూ కామెంట్స్ చేశారు.

గత వారం రాజ్యసభలో సినీ రంగానికి సంబంధించిన బిల్లుపై చర్చలో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ సినిమా రంగంలో సంపాదన కొద్దిమందికి మాత్ర‌మే అందుతోంద‌ని.. సినీ ప‌రిశ్ర‌మ‌లో పని చేసే కార్మికులకు మాత్రం తగిన న్యాయం జరగట్లేదని దాని గురించి ఆలోచించాలని మాట్లాడిన విషయం తెలిసిందే.