ఆయన విశాఖ సాయిరెడ్డే… చక్రం తిరుగుతోందలా..

ఏడాది క్రితం విశాఖ వైసీపీ బాధ్యతలను రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ హై కమాండ్ అప్పగించించి. దాంతో వైవీ సుబ్బారెడ్డి తిరుపతి హైదరాబాద్ విశాఖల మధ్య ఫ్లైట్…

ఏడాది క్రితం విశాఖ వైసీపీ బాధ్యతలను రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ హై కమాండ్ అప్పగించించి. దాంతో వైవీ సుబ్బారెడ్డి తిరుపతి హైదరాబాద్ విశాఖల మధ్య ఫ్లైట్ లో చక్కర్లు కొడుతున్నారు.

ఆయన లేటెస్ట్ గా పార్టీ పరంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని మార్చేసి విజయసాయిరెడ్డి తన పట్టు విశాఖలో నిరూపించుకున్నారన్నది పార్టీ వర్గాల మాట. పార్టీ అనుబంధ కమిటీలకు జోనల్ ఇంచార్జిలను వైవీ సుబ్బారెడ్డి నియమించారు. యువజన విభాగానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమారుడుని నియమించారు. మహిళా విభాగానికి పీలా వెంకట లక్ష్మి పేర్లను ఖరారు చేశారు.

దీని మీద ఈ నెల 10న ప్రకటన వచ్చింది. దీంతో విశాఖ వచ్చీ పోతున్న విజయసాయిరెడ్డి దృష్టికి పార్టీ నాయకులు తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి ఆ పదవులకు తన వర్గంగా ఉన్న సునీల్ కుమార్, గరికిన గౌరిలకు కట్టబెట్టించేలా పావులు కదిపారు. ఒక్క రోజు తేడాలో వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన వారికి పదవులు ఎగిరాయి. విజయసాయిరెడ్డి పంతమే నెగ్గింది అని అంటున్నారు.

ఈ టోటల్ ఎపిసోడ్ లో మాజీ మంత్రి అవంతి కుమారుడికి పార్టీ పదవి ఇలా వచ్చి అలా జారిపోయింది. దానికి విజయసాయిరెడ్డి చక్రం తిప్పడమే కారణం అని భావిస్తూ ఆయన వర్గీయులు మండిపోతున్నారుట.

విజయసాయిరెడ్డికి విశాఖ పార్టీ మీద అధినాయకత్వం వద్ద తన పలుకుబడికి ఇదే రుజువు అని ఆయన వర్గీయులు అంటున్నారు. ఆయన ఇంకా విశాఖ సాయిరెడ్డేనని అంటున్నారు. ఎన్నికల వేళకు ఆయన మళ్లీ విశాఖ రాజకీయాల్లోకి వచ్చి తన హవా చాటుతారని అంటున్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తాను చేసిన నియామకాలు రద్దు కావడం పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అన్నదే వైసీపీలో హాట్ టాపిక్.