గ‌తం కంటే స్వ‌ల్పంగా పెరిగిన పోలింగ్‌

గ‌త ఎన్నిక‌ల కంటే ఈ ద‌ఫా పోలింగ్ స్వ‌ల్పంగా పెరిగింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌పై లెక్క‌లు వ‌స్తాయ‌ని ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. 2019లో పోలింగ్ 79.2…

గ‌త ఎన్నిక‌ల కంటే ఈ ద‌ఫా పోలింగ్ స్వ‌ల్పంగా పెరిగింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌పై లెక్క‌లు వ‌స్తాయ‌ని ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. 2019లో పోలింగ్ 79.2 శాతం న‌మోదైన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ద‌ఫా త‌మ అంచ‌నా ప్ర‌కారం 81.30 శాతం వ‌ర‌కు న‌మోదు కావ‌చ్చ‌ని మీనా తెలిపారు.

ఇవాళ ఉద‌యం మీడియాతో ఆయ‌న మాట్లాడే స‌మ‌యానికి పోస్ట‌ల్ బ్యాలెట్లు 1.2 శాతంతో క‌లుపుకుని 79.40 శాతం న‌మోదైన‌ట్టు చెప్పారు. కొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి త‌ర్వాత కూడా పోలింగ్ జ‌రిగింద‌ని, వాటి వివ‌రాలు సాయంత్రానికి వ‌స్తాయ‌ని, అప్పుడు పూర్తి లెక్క తేలుతుంద‌ని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. సుమారుగా 81.30 శాతం ఫైన‌ల్ లెక్క తేల‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

గ‌తంతో పోల్చుకుంటే చాలా స్వ‌ల్పంగా మాత్ర‌మే పోలింగ్ పెరిగిన‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు. భారీగా పోలింగ్ న‌మోదు కావ‌డంపై వైసీపీ, కూట‌మి నేత‌లు ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. పెరిగిన పోలింగ్ అనుకూలం త‌మ‌కంటే త‌మ‌క‌ని అత్యుత్సాహంతో చెబుతున్నారు. ఓట‌ర్లు మాత్రం త‌మ తీర్పును ఇచ్చేసి, త‌మ బాధ్య‌త తీరిపోయింద‌ని అంటున్నారు.

ఓట‌ర్ తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. పోలింగ్ శాతం పెరిగితే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌గా ఇంత కాలం ఒక అభిప్రాయం వుంది. అయితే ఈ ద‌ఫా అనుకూల ఓటు వేశార‌ని వైసీపీ ఎంతో ధీమాగా చెబుతోంది. ఏది నిజ‌మో తేలాలంటే వ‌చ్చే నెల నాల్గో తేదీ వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.