ఎల్లో మీడియా మైండ్ గేమ్… తస్మాత్ జాగ్రత్త‌

ఎన్నికలు రెండేళ్ళు ఉండగానే ఎల్లో మీడియా మైండ్ గేమ్ మొదలెట్టేసింది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బలం ఒక్కసారిగా పెరిగిపోయినట్లుగా కూడా ప్రచారం చెస్తోంది. అదే సమయంలో వైసీపీ గురించి కూడా లేని పోని కధనాలు…

ఎన్నికలు రెండేళ్ళు ఉండగానే ఎల్లో మీడియా మైండ్ గేమ్ మొదలెట్టేసింది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బలం ఒక్కసారిగా పెరిగిపోయినట్లుగా కూడా ప్రచారం చెస్తోంది. అదే సమయంలో వైసీపీ గురించి కూడా లేని పోని కధనాలు రాస్తోంది. ఆ మైండ్ గేమ్ లో పడవద్దు. మనం నేరుగా ప్రజలతోనే కనెక్ట్ కావాలి. వారి నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఇదీ వైసీపీ పెద్దలు క్యాడర్ కి చేస్తున్న హిత బోధ.

మొత్తానికి వైసీపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి పార్టీ మీటింగులను నిర్వహిస్తున్నారు. అలా శ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశానికి పెద్ద సంఖ్యలోనే క్యాడర్ హాజరయింది. ఈ సందర్భంగా మంత్రులు ధర్మాన క్రిష్ణ దాస్, బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పార్టీ మనది, మనమందరం కలసి మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపు ఇవ్వడం విశేషం.

జగన్ అండ మనకు కొండంత ఉంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు, ఆ మంచిని జనాలతో పంచుకోవడం ద్వారా వైసీపీని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఎల్లో మీడియా మాయలో అసలు పడనే వద్దు అంటూ కూడా వైసీపీ పెద్దలు చెప్పడం విశేషం.

మనలో ఏ కోశానా అయినా ఉన్న చిన్నపాటి అసంతృప్తి బయట శతృవుకు బలంగా మారవద్దు అని కూడా హెచ్చరించడం గమనార్హం. నీతివంతమైన పాలన అందించే ప్రభుత్వం వైసీపీది అని మంత్రులు పేర్కొనడం గమనార్హం. 

మొత్తానికి ఈసారి జగన్ కాదు, మనమే జనంలోకి వెళ్ళి పార్టీని గెలిపించుకోవాలని, మళ్లీ జగన్ని సీఎం చేయాలని పార్టీ పెద్దలు చెప్పిన మాటా అయితే క్యాడర్ కి బాగానే తాకింది. మరి అది ఆచరణలో పెడితే అద్భుతాలే జరుగుతాయి.