పెళ్లిళ్లు, విడాకుల‌తో ప‌వ‌న్‌ను కుళ్ల పొడిచిన జ‌గ‌న్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ, జనసేనపై తీవ్ర‌స్థాయిలో  ధ్వ‌జ‌మెత్తారు.  Advertisement చంద్రబాబు, పవ‌న్‌ల‌పై ఓ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ, జనసేనపై తీవ్ర‌స్థాయిలో  ధ్వ‌జ‌మెత్తారు. 

చంద్రబాబు, పవ‌న్‌ల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు ఎత్త‌కుండా, ఎప్ప‌ట్లాగే ఆయ‌న పెళ్లిళ్లు, విడాకులంటూ సెటైర్స్ విసిరాఉ. సీఎం జ‌గ‌న్ ప‌దేప‌దే ప‌వ‌న్ పెళ్లిళ్ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌నంలో చుల‌క‌న చేసే ప్ర‌య‌త్నాన్ని తీవ్ర‌త‌రం చేయ‌డం గ‌మ‌నార్హం.

రెండు సినిమాల‌కు మ‌ధ్య షూటింగ్ విరామ స‌మ‌యంలో పొలిటిక‌ల్ మీటింగ్స్ పెడుతుంటాడ‌ని ప‌వ‌న్‌పై పంచ్ విసిరారు. అది కూడా బాబు స్క్రిప్ట్ ప్ర‌కారం మీటింగ్ వుంటుంద‌న్నారు. ప్యాకేజీ స్టార్ వ‌చ్చి నాలుగు రాళ్లు మీ బిడ్డ మీద వేస్తుంటార‌ని త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని గుర్తు చేశారు. 

ఇలాంటి వాళ్ల‌కు ప్ర‌జాజీవితం తెలుసా? ఇలాంటి వాళ్లు మంచి చేయ‌గ‌ల‌రా? అనేది ఒక్క‌సారి ఆలోచించాల‌ని ప్ర‌జ‌ల్ని కోరారు. చంద్ర‌బాబు, ఆయ‌న ద‌త్త‌పుత్రుడు పొత్తులు, ఎత్తులు, కుట్ర‌ల్ని న‌మ్ముకున్నారన్నారు. 

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం కూడా గుర్తు రాదని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని వెట‌క‌రించారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని వైఎస్ జ‌గ‌న్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. 

చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌కు కూడా జ‌గ‌న్ చీవాట్లు పెట్టారు. ద‌త్త‌పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా కూడా వ‌ద్ద‌ని ఓడించే ప‌రిస్థితిని చూశామ‌న్నారు. రాజ‌కీయ పార్టీ పెట్టిన ద‌త్త‌పుత్రుడు ప‌దేళ్లుగా 175 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేని దుస్థితిలో ఉన్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. త‌న‌కు సీఎం పదవి వద్ద‌ని, కేవ‌లం దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడ‌ని విమ‌ర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు త‌న‌ను విమర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. పొత్తులు పెట్టుకునేది,  తెగదెంపులు చేసుకునేది వీళ్లే అని ప్ర‌తిప‌క్షాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివాహాలు చేసునేది వీళ్లే, విడాకులు తీసుకునేది వీళ్లే అంటూ సెటైర్స్‌తో ప‌వ‌న్‌ను, ప్ర‌తిప‌క్షాల‌ను జ‌గ‌న్ కుళ్ల‌పొడిచారు. 

ద‌త్త తండ్రి డైరెక్షన్ ప్ర‌కార‌మే ద‌త్త పుత్రుడు న‌డుచుకుంటాడ‌ని జ‌గ‌న్ దెప్పి పొడిచారు. ఏ పార్టీని క‌ల‌వాలో ద‌త్త పుత్రుడికి చంద్ర‌బాబే చెప్తాడ‌ని చుర‌క‌లు అంటించారు. బాబు చెబితే ద‌త్త‌పుత్రుడు బీజేపీ ప‌క్క‌న చేర‌తాడ‌ని, విడాకులు ఇవ్వ‌మంటే ఇచ్చేస్తాడ‌ని వ్యంగ్యంగా అన్నారు.