ఏపీలో అధికారం వైసీపీదే- ఆరా మ‌స్తాన్

ఏపీలో మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్‌నే అధికారంలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆరా మ‌స్తాన్ స‌ర్వే సంస్ధ‌. వైసీపీకి 94- 104 స్థానాలు, టీడీపీ కూట‌మికి 71-81 సీట్ల‌తో మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తోంది.…

ఏపీలో మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్‌నే అధికారంలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆరా మ‌స్తాన్ స‌ర్వే సంస్ధ‌. వైసీపీకి 94- 104 స్థానాలు, టీడీపీ కూట‌మికి 71-81 సీట్ల‌తో మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తోంది. సంక్షేమ ప‌థ‌కాలతో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు తిరిగి ప‌ట్టం క‌ట్టిన‌ట్లు ఆరా మ‌స్తాన్ స‌ర్వే వెల్ల‌డించింది. 

మ‌రి ముఖ్యంగా టీడీపీ కీల‌క నేత నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుండి, కుప్పం నుండి చంద్ర‌బాబు, హిందూపురం నుండి బాల‌కృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తార‌న్నారు. అలాగే జ‌న‌సేన అధినేత పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నార‌ని అలాగే రెండు ఎంపీ సీట్లలో కూడా జన‌సేన గెల‌వ‌బోతుంద‌ని ప్ర‌క‌టించింది.

అలాగే వైసీపీ కీల‌క నేత అయినా విజ‌య‌సాయి రెడ్డి నెల్లూరు నుండి ఓట‌మి పాలు అవుతార‌ని.. అలాగే మంత్రులుగా ప‌ని చేసిన రోజా, ఉష‌శ్రీ చ‌ర‌ణ్, గుమ్మ‌నూరు జ‌య‌రాం ఓడిపోతార‌ని వెల్ల‌డించారు. అలాగే మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోతున్న‌ట్లు మ‌స్తాన్ చెప్పారు.