“ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరిగినా ప్రజలు స్పందించరా? రోడ్ల మీదికొచ్చి తిరుగుబాటు చెయ్యరా?” అని కొన్ని మీడియా సంస్థలు..
“మీకు సిగ్గు లేదయ్యా. మీరు అమ్ముడుపొయ్యారు” అని ఆ మధ్య గుంటూర్ ప్రచారంలో సాక్షాత్తు చంద్రబాబు గారు అనడం విచిత్రం, విడ్డూరం, వెర్రితనం.
ఒక్కసారి ఆంధ్ర ప్రజల నైజం ఏంటో గతంలోకి చూసి గుర్తుచేసుకుందాం.
– రాష్ట్రాన్ని విడగొట్టారన్న కోపంతో కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికల్లో వందడుగుల గొయ్యి తీసి పాతేశారు. ఆ పార్టీకి రాష్ట్రంలో నామరూపాలు లేవిప్పుడు.
– ఎన్నికలకి కాస్త ముందు 50000 కోట్ల రూపాయలు పసుపు కుంకాల పేరుతో పంచినా కూడా ఇది మోసం అని గ్రహించి 2019 ఎన్నికల్లో టీడీపీకి చితిపేర్చి తగలబెట్టారు. అదొక్కటే కారణం కాదు. భ్రమరావతి కథలు, గరుడపురాణాలు అన్నీ వినీ వినీ విసిగెత్తిపోయి సైలెంటుగా స్పాట్ పెట్టేశారు.
– అప్పటిదాకా అంటగాకి సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీతో తూచ్ అని పవన్ కళ్యాణ్ అన్నా కూడా, ఏ మాత్రం నమ్మని జనం గాజువాకలో గాజుగ్లాసు పగలగొట్టేసారు. పోనీ భీమవరంలో ఏమైనా కనికరించారా అంటే అక్కడ కూడా భీముడు గద పెట్టి గొట్టినంత గట్టిగా కొట్టారు.
ఆంధ్రా ప్రజలు భయంకరమైన సైలెంట్ కిల్లర్స్. అస్సలు హింట్ ఇవ్వరు. “ఓన్లీ వన్స్- ఫసక్” టైపు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనికి మినహాయింపు కాదు.
వాళ్లకి బాగానే నడుస్తున్నంత కాలం ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోరు. వాళ్లకి కష్టంగా అనిపించినా, ఇష్టం తగ్గినా ఫసక్కుమని పొడుస్తారు.
అంతే తప్ప కొన్ని మీడియా చానల్స్ కోరుకుంటున్నట్టుగా నిరసనలు, తిరుగుబాటులు చెయ్యరు. ఒకవేళ చేస్తున్నారంటే వాళ్లు కచ్చితంగా ప్రతిపక్ష పక్షులు మాత్రమే. వాళ్లకి తప్ప ఇంకెవరికీ ఆ అవసరం ఉండదు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత పంచాయితీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎంపీటీసీలు, బై ఎలక్షన్స్..ఇలా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రజాభిప్రాయం అక్కడ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అంతే తప్ప రోడ్ల మీద గుమిగూడిన నలభైమంది జనంతో కాదు.
ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రజాతిరుగుబాటు కోరుకోవడమంటే కడుపుమంట తప్ప మరొకటి కాదని ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేకత మరింత పోస్ట్ పోన్ అవడం తప్ప ఇంకోటేం జరగదు.
సైలెంట్ కిల్లర్స్ అయిన ప్రజలకి కావల్సింది సైలెన్స్. ప్రధానప్రతిపక్ష వర్గం ఎప్పుడు సైలెన్స్ పాటిస్తుందో అప్పుడే కాస్త ప్రభుత్వం మీద దృష్టి పెడతారు. నిజంగా నచ్చని అంశం ఉంటే ఎన్నికల్లోనే ఇంకు చుక్కతో సమాధానం చెప్తారు. కానీ ప్రస్తుత ప్రధానప్రతిపక్ష వర్గం యొక్క కాకి గోల వల్ల ప్రతిపక్ష వ్యతిరేకత వస్తోందంతే.
ఇది తెలుసుకోనంత వరకూ రావణకాష్టంలా ప్రతిపక్షానికి మరణమృదంగం మోగుతూనే ఉంటుంది.
విష్ణుభొట్ల విజయ్ కుమార్