Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

చంద్రబాబునాయుడు తుది జాబితాను ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ పోటీచేయబోతున్న అన్ని స్థానాలకు ప్రకటన పూర్తయినట్టు అయింది. అయితే ఈ జాబితాను పరిశీలిస్తే.. రెండు కీలక స్థానాల్లో ఓడిపోవడానికి సిద్ధపడే జాబితాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు ఎన్నిరకాల కొత్త మాయోపాయాలు పన్నాలని ప్రయత్నించినప్పటికీ.. ఓటమి భయంతో మార్పు చేర్పులు చేయాలని అనుకున్నప్పటికీ.. ఆయన పాచిక పారలేదు. ఆయన మీద పార్టీ నాయకుల ఒత్తిడే పనిచేసింది. మొత్తానికి ఓటమి తప్పదనే భయం ఉన్నదిగానీ.. చంద్రబాబునాయుడు తనకు ఇష్టంలేకపోయినా.. ఒత్తిడులకు తలొగ్గి టికెట్ల ప్రకటనను పూర్తిచేశారు.

తెలుగుదేశం పార్టీ చీపురుపల్లి, భీమిలి నియోజకవర్గాలను ఓడిపోవడానికి సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ తో తలపడి నెగ్గగల కేండిడేట్ తమ పార్టీకి లేరని చంద్రబాబునాయుడుకు ఎఫ్పుడో తెలుసు. కేవలం డబ్బు ద్వారా మాత్రమే చీపురుపల్లిలో తమ పార్టీకి కాసిని ఓట్లు తెచ్చుకోగలం అని చంద్రబాబు నమ్మిక.

బొత్స సత్యనారాయణను ఎదుర్కోవాలంటే.. వందకోట్లయినా పెట్టగల శక్తి ఉన్న నాయకుడు కావాలని ఆయన దేవులాడారు. దానితో పాటు బలమైన కులం కూడా కావాలనుకున్నారు. ఆ కొలబద్ధల మీదనే ఆయన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లికి పంపాలని ఆరాటపడ్డారు. గంటా అయితే ఎంత డబ్బయినా పెట్టుకోగలడని, కులం కూడా సరితూగగలడని ఆశ. అయితే చంద్రబాబు ఎంతగా నచ్చజెప్పినా గంటా మాత్రం చీపురుపల్లి వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోకపోవడంతో పాటు.. భీమిలి తనకు ఇచ్చి తీరాల్సిందేనని మొండికేశారు. భీమిలి ఇవ్వకపోతే పార్టీ వీడడానికి కూడా సిద్ధపడ్డారు.

అయితే చంద్రబాబు చేయించుకున్న సర్వేల ప్రకారం భీమిలిలో గంటా గెలిచే అవకాశం కూడా లేదు. గంటాను అక్కడినుంచి తప్పించి మరోచోటకు పంపాలనుకోవడం వెనుక అది కూడా ఒక కారణం. కానీ.. గంటా వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ప్రతి ఎన్నికలకూ నియోజకవర్గం మారుతూ గెలుస్తూ ఉండే గంటా.. ఈసారి సిటింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీచేసి గెలిచి రికార్డు సృష్టించాలని అనుకున్నారు. ఆయన గెలవడని చంద్రబాబుకు ఒక నమ్మకం. అయితే.. గంటా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు.

చివరివరకు నచ్చజెప్పడానికి వ్యవహారాన్ని సాగదీసిన చంద్రబాబునాయుడు.. చివరి విడతలో గంటా కోరినట్టుగా ఆయనకు భీమిలి నియోజకవర్గాన్ని, చీపురుపల్లిలో వేరే గత్యంతరం లేక కళా వెంకట్రావును ప్రకటించారు. ఈ రెండుస్థానాల్లోనూ ఓటమి తప్పదని తెలిసే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?