Advertisement

Advertisement


Home > Politics - Andhra

బిజెపి లేఖ: పవన్ సినిమాలకూ బ్రేక్ పడుతుందా?

బిజెపి లేఖ: పవన్ సినిమాలకూ బ్రేక్ పడుతుందా?

ఎన్నికల్లో గెలుపు కోసం రకరకాల ఉపాయాలు పన్నుతుంటాయి రాజకీయ పార్టీలు. తమ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో వారి వ్యాపారాలకు బ్రేకులు వేయడం కూడా ఒక మార్గంగా భావిస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ కూడా అలాంటి పనే చేసింది.

దక్షిణాదిలో ఆ పార్టీ అస్తిత్వాన్ని ఎగుడుదిగుడులుగా మారుస్తున్న కర్ణాటకలో ఆ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అక్కడ కాంగ్రెసు స్పీడుకు బ్రేకులు వేయడానికి వారు సినిమా హీరోను టార్గెట్ చేయడం గమనార్హం.

కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ హీరో శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్ ను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే.. శివరాజ్ కుమార్ భార్య గీత శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడుతోంది. కాబట్టి లోక్ సభ ఎణ్నికలు ముగిసేదాకా శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలనేది బిజెపి కోరిక.

రాష్ట్రంలో ఫాలోయింగ్ ఉన్న హీరో గనుక.. కాంగ్రెస్ కోసం రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో ఉన్నారు గనుక.. ప్రజలమీద ప్రభావం చూపగలరు గనుక.. ఆయన సినిమాల పబ్లిసిటీ జరగకుండా, సినిమాలు ఎన్నికలయ్యేదాకా ఆడకుండా నిషేధించాలని బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.

ఈ డిమాండులో లాజిక్ ఉందా లేదా తర్వాతి సంగతి. అక్కడ కర్నాటకలో బిజెపి కోరిక సహేతుకమైనదే అయితే గనుక.. ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాలను, ట్రైలర్ లను కూడా నిషేధించాల్సిందే. శివరాజ్ కుమార్ గురించి బిజెపి ఏయేమాటలు అయితే చెప్పిందో.. అవన్నీ కూడా పవన్ కల్యాణ్ కు కూడా వర్తిస్తాయి.

అసలే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో సినిమా ట్రైలర్ విడుదల చేసి.. అందులో రాజకీయ డైలాగులే మాట్లాడుతున్నారు. గతంలో ఓడిపోయిన వైనం గురించి చింత కూడా లేకుండా, గాజు పగిలేకొద్దీ పదునెక్కుతుంది అంటూ.. పడికట్టు పంచ్ డైలాగులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేసే విషయాలే. కానీ.. ఇక్కడ బిజెపి ఈ సినిమా హీరో చిత్రాల గురించి ఫిర్యాదు చేయకపోవచ్చు. ఇక్కడ వారు పవన్ తో మిత్రపక్షంగానే ఉన్నారు.

అయినా ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా విధానాలను చూపించడం, ఏ గాలికి ఆ చాప అన్నట్టుగా వ్యవహరించడం, ప్రత్యర్థులను కార్నర్ చేయడానికి అర్థంపర్థం లేని దారులు తొక్కడం తమకు అలవాటే అని బిజెపి శివరాజ్ కుమార్ సినిమా నిషేధాన్ని కోరడం ద్వారా నిరూపించుకున్నట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?