Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ గెలిస్తే బీజేపీ నేత సంబరం

టీడీపీ గెలిస్తే బీజేపీ నేత సంబరం

అదేంటో విడ్డూరం కాకపోతే. టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా విజయం సాధించారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. వాస్తవానికి టీడీపీకి ఒక ఎమ్మెల్సీ సీటుని గెలుచుకునే బలం ఉంది. కానీ ఆ పార్టీ నుంచి నలుగురు అటు నుంచి వైసీపీలోకి రావడం వల్ల ఓట్లు తగ్గిపోయాయి.

కానీ వైసీపీ నుంచి మరో నలుగురు టీడీపీ వైపు వెళ్ళి మద్దతు ప్రకటించడంతో యధాతధంగా టీడీపీకి ఉన్న 23 నంబర్ అలాగే వచ్చి ఎమ్మెల్సీ గెలిచారు. ఇక్కడ చూస్తే ఇటు టీడీపీ అటు వైసీపీ రెండూ కూడా చెరి నలుగురు రెబెల్స్ తో దెబ్బ తిన్నవే కావడం విశేషం.

రాజకీయ పార్టీ ఏదైనా రంగు ఏదైనా నంబర్ ముఖ్యం కాబట్టి టీడీపీ అలా 23 నంబర్ తో గెలుపు సాధించింది. ఈ విజయం టీడీపీ కంటే బీజేపీ లో ఒక నాయకుడికి ఎక్కువ ఆనందం కలిగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అయితే తెలుగుదేశం గెలుపుని తెగ ఆస్వాదిస్తున్నారు. అసలు ఇది కదా గెలుపు అంటున్నారు.

వైసీపీ అప్రజాస్వామిక పాలన మీద సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. అందుకు గానూ ఆయన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధను అభినందిస్తున్నారు. 2024లో వైసీపీ ఓటమి ఇక ఖాయమని జోస్యం చెబుతున్నారు.

ఇన్ని చెప్పిన విష్ణు కుమార్ రాజు వైసీపీ ఓడితే గెలిచేది బీజేపీ అని మాత్రం అనలేకపోతున్నారు. సొంత పార్టీ మీద ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. బీజేపీకి ఏపీలో నోటా కంటే ఎందుకు తక్కువ ఓట్లు వస్తున్నాయో ఇప్పటికైనా అర్ధం అవుతోంది కదా అంటున్నారు అంతా. రాజు గారి భాషలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అంటే టీడీపీని గెలిపించాలన్న మాట. ఆ పని బీజేపీ చేయలేకపోతోందని జనాలు అర్ధం చేసుకుంటున్నారేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?