Advertisement

Advertisement


Home > Movies - Movie News

రిలయన్స్ చేతిలో 'స్లమ్ డాగ్ హజ్బెండ్'

రిలయన్స్ చేతిలో 'స్లమ్ డాగ్ హజ్బెండ్'

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఇది మంచి కంటెంట్ ఉన్న ఓ చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం చేస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. గతంలోనే అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ కు మంచి స్పందన వచ్చింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన ఫ్రస్ట్రేషన్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ పై సాగే ఈ పాటలో స్టార్ యాక్టర్ సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోంది ఈ సినిమా.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?