Advertisement

Advertisement


Home > Movies - Movie News

సలార్…ఇంగ్లీష్ లో పాటలు-కామెడీ లేకుండా

సలార్…ఇంగ్లీష్ లో పాటలు-కామెడీ లేకుండా

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా విడుదలకు రంగం సిద్దం అవుతోంది. సెప్టెంబర్ 28 విడుదల. ఈ సినిమాను విదేశాల్లో ఇంగ్లీష్ భాషలో కూడా డబ్ చేసి విడుదల చేసేందుకు వర్క్ చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే ఈ వెర్షన్ లో పాటలు, కొన్ని కామెడీ సీన్లు వుండవట. తెలుగు వెర్షన్ రెండు గంటల ముఫై నిమషాల వరకు వుంటే ఇంగ్లీష్ వెర్షన్ రెండు గంటల లోపే వుంటుందట. ఇదో తరహా కొత్త ప్రయోగం అనుకోవాలి.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని టాక్ వుంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసారు. సెప్టెంబర్ నెలాఖరులో ఈ సినిమా విడుదల తరువాత ప్రాజెక్టు కె, పీపుల్స్ మీడియా-మారుతి సినిమా విడుదలయ్యాక రెండో భాగం సంగతి చూస్తారు. ఈ లోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసుకుని రావాల్సి వుంటుంది.

కెజిఎప్ 2 తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు ముందుగా ప్రభాస్ నుంచి ఆదిపురుష్ సినిమా వుంది కానీ దాని మీద కన్నా ఈ సలార్ మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. కెజిఎప్ టోన్ లోనే ఫుల్ డార్క్ థీమ్ యాక్షన్ సినిమాగా ఇది తయారవుతోంది. 

బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు డిస్సపాయింట్ చేసాయి. మళ్లీ ప్రభాస్ ఇమేజ్ పైకి లేవాలి అంటే సలార్ సినిమా ఓ లెవెల్ లో వుండి తీరాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?