Advertisement

Advertisement


Home > Politics - Andhra

బీజేపీ మాధవ్ కి పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు!

బీజేపీ మాధవ్ కి పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు!

పార్టీనే నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి కమలం పార్టీ బిగ్ హ్యాండ్ ఇచ్చేసింది. పీవీఎన్ మాధవ్ అంటేనే నిజాయతీకి క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. ఆయన తన జీవితాన్నే ఆరెస్సెస్ నుంచి ప్రారంభించారు. విద్యార్ధి నేతగా బీజేపీలో యువమోర్చా లీడర్ గా ఎన్నో పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్రా బీజేపీకి వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు.

బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్ మాధవ్ గతంలో ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా అప్పట్లో ఎంతో ఒత్తిడి మరెంతో ప్రయత్నం జరిగిన మీదటనే సాధ్యపడింది. మాధవ్ కి 2014లోనే విశాఖ ఉత్తరం సీటు దక్కాల్సింది. ఆ సీటుని అప్పట్లో విష్ణు కుమార్ రాజుకు ఇప్పించారు.

ఆయనకు 2019లో కూడా మరోసారి టికెట్ ఇచ్చారు. ఈసారి అయినా మాధవ్ కి ఉత్తరం సీటు దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయన సామాజిక వర్గం అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే విష్ణుకుమార్ రాజుకే టికెట్ అన్నారు. పోనీ అనకాపల్లి ఎంపీ సీటు తీసుకున్నారు అది అయినా ఆయనకు ఇస్తారని అనుకుంటే దాన్ని ఎక్కడో కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ కి ఇచ్చేశారు.

విజయనగరం ఎంపీ సీటు ఇస్తామని ఊరించారు. చివరికి దానిని కూడా లేకుండా చేశారు. చివరి ప్రయత్నంగా విశాఖ సౌత్ అయినా లేక భీమిలీ  సీటు  అయినా మాధవ్ కి ఇప్పించాలని అనుచరులు చేసిన ప్రయత్నాలు సైతం విఫలం అయ్యాయి.

దాంతో బీసీ నేతకు టికెట్ లేదా అన్న బాధ ఆయన వర్గంలో కలుగుతోంది. పీవీఎన్ మాధవ్ తండ్రి దివంగత నేత పీవీ చలపతిరావు తన జీవితాన్ని బీజేపీ కోసం ధారపోసిన నాయకుడు.

ఆయన ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడు. ఆయన బీజేపీ ఉనికి కోసం అనేక సార్లు పోటీ చేసి జనంలో పార్టీని తీసుకెళ్ళిన వారు అలాంటి తొలితరం కుటుంబానికి అన్యాయం జరిగింది అన్నది అయితే అందరిలోనూ ఉంది అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?