Advertisement

Advertisement


Home > Politics - Andhra

అక్కడ నల్లగా ఇసుక... ఎందుకలా...?

అక్కడ నల్లగా ఇసుక... ఎందుకలా...?

ఇసుక రంగు అందరికీ తెలుసు. సముద్రపు ఇసుక అయితే అది లేత బంగారంగా అలా కళకళలాడుతూ చేతుల నుంచి సన్నగా జారిపోతుంది. అసలు ఆ ఇసుకతో ఆడుకోవడానికే సందర్శకులు బీచ్ కి వస్తారు.

మెత్తమెత్తగా ఉన్న ఇసుక తిన్నెల మీద కూర్చుని వెన్నెల్లో ముచ్చట్లు పెడతారు. ఎదురుగా కనిపించే కెరటాలను చూస్తూ కేరింతలు కొడతారు. అలాంటి బీచ్ ఇసుక నలుపు రంగులో మారిపోతే భయమేయదూ. ఏకంగా నడిచినంత మేర. కనిపించినంత మేర నల్లగా ఇసుక మారిపోయి వికృత రూపుతో కనిపిస్తే ఎవరైనా జడుసుకుంటారు కదా.

విశాఖ బీచ్ ఇసుక ఇపుడు రంగు మార్చుకుని అలాగే సందర్శకులను భయపెడుతోంది. ఏమైంది బంగారం లాంటి ఇసుకకు అని జనాలు తమలో తామే ప్రశ్నించుకుంటూ ఆ చోద్యాన్ని కాసింత ఆందోళనతోనే చూస్తున్నారు.

ఇంతకీ విశాఖ బీచ్ ఇసుక ఇలా నలుపు రంగులోకి మారిపోవడానికి కారణాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు. విశాఖ రామక్రిష్ణా బీచ్ పరిసరాలలో ఇసుక అన్నీ ఇలా నల్లటి రంగుగా మారడం వెనక సముద్రంలోని ఇనుప రజను ఒక కారణంగా చెబుతున్నారు. ఇనుప రజను ఎక్కువగా ఒడ్డుకు కొట్టుకుని వచ్చినపుడు ఇసుక రంగు ఇలా మారిపోతుందని ఏయూ పరిశోధకులు అంటున్నారు.

అంతే కాదు సముద్రంపు మురుగు కూడా ఒడ్డుకు కొట్టుకుని వస్తే ఇసుక రంగు కూడా మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా బంగారం లాంటి ఇసుక ఇలా కళావిహీనంగా నలుపు రంగులోకి మారిపోవడానికి ప్రకృతి ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొందరగా మా ఇసుక బంగారం కంటికి కనిపించేలా చేయి నీలి సంద్రమా అని కోరుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?