రాష్ట్రంలో హిందూపురం ఎంపీ వైరల్ వీడియో రాజకీయ రచ్చ జరుగుతోంది. ఒక వైపు పోలీసులు ఈ వీడియో ఒరిజినల్ కాదంటూంటే టీడీపీ మాత్రం వీడియో పట్టుకొని గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకొవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ అనుకుల మీడియా రోజు డిబెట్ల్ చేస్తూ రాజకీయ రచ్చ చేస్తునే ఉన్నారు. కానీ ఇందులో సీనియర్ టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ కనపడటం లేదు.
గోరంట్ల రాజకీయ ప్రస్ధానం మొదలైంది జేసీ బ్రదర్స్ వల్లే అందుకే అందరూ జేసీ బ్రదర్స్ రియక్షన్స్ కోసం ఎదురు చుస్తున్నారు. కానీ అటూ వైపు నుండి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడం చూస్తుంటే జేసీ బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది అందరిని అలోచింప చేస్తోంది.
2019 ఎన్నికల ముందు అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లడుతూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా అప్పట్లో కదిరి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం మెలేసి నాలుక తెగ్గోస్తా అంటూ జేసీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో జేసీకి పబ్లిక్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఐగా ఉన్న మాధవ్ కు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చింది. మాధవ్ ఎంపీగా రాజకీయాల్లో ఉన్నారంటే వైసీపీ పాత్ర ఎంతుందో అంతే పాత్ర జేసీ వైపు కూడా ఉంది.
అసలే జేసీ బ్రదర్స్ కు నోరు అడ్డుఅదుపు లేకుండా ఉంటుంది. తన ప్రత్యర్థి అయిన గోరంట్ల మాధవ్ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా మీడియా ముందుకు ఎందుకు రావడం లేదో అనేది శేష ప్రశ్న. జేసీ బ్రదర్స్.. మాధవ్ విషయంఎందుకులే అనుకున్నారా లేక భయపడ్డరా. లేకపోతే జేసీ బ్రదర్స్ మాధవ్ ను ఒక మాట అంటే మాధవ్ వైపు నుండి ఎలాంటివి మాటలు వస్తాయని ముందే గ్రహించి సైలెంట్ గా ఉన్నారా. అనంతపురం టీడీపీ నేతలు అందరూ గోరంట్ల మాధవ్ పై స్పందించారు. జేసీ నుండి మాత్రం ఎటువంటి రావడం లేదు.
జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై కోపంతో సైలెంట్ ఉన్నారా?. అంటే ఔనంటూన్నారు టీడీపీ నేతులు. గత కొద్ది రోజుల క్రితం జేసీ ఇంటిపై ఈడీ దాడులు జరిగినప్పుడు టీడీపీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో జేసీ బ్రదర్స్ కాస్తా కోపంతో ఉన్నారని తాడిపత్రి టీడీపీ వర్గాలు అనుకుంటున్నా మాటలు. జేసీ బ్రదర్స్ చూపు జాతీయ పార్టీపై ఉందని ఈడీ కేసుల నుండి బయట పడటానికి ఇదే మార్గం అనుకున్నట్లు ఉన్నారు.