తెలంగాణ తాజా రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో ఎటువంటి పరిస్ధితులో గెలిచి వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు తెలంగాణలో స్ధానం ఉండదని జాతీయ పార్టీలకు తెలిసేలా వ్యూహరచన చేస్తున్నారు.
గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల పాఠాలు నేర్చుకున్న టీఆర్ఎస్, మునుగోడు విషయంలో కాస్తా భిన్నంగానే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ బలం సోషల్ మీడియా అని అందుకే వారికి ధీటుగా టీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తు బీజేపీకి కౌంటర్ ఇవ్వనున్నారు.
అలాగే హుజురాబాద్ ఉపఎన్నికలో గులాబీ పార్టీ సర్వశక్తులు బడ్డిన ఓటమికి ప్రధాన కారణం సరైన అభ్యర్ధి కాదని నిర్ణయించుకొని, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టలని పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.
మునుగోడు అభ్యర్థిపై పలు సర్వేలు తీసుకున్న టీఆర్ఎస్ అధినాయకత్వం అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే ముగ్గు చూపుతున్నాట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా మంత్రులకు అవే సూచనలు చెసినట్లు తెలుస్తోంది. మండలాల వారిగా ఎమ్మెల్యేలను, మంత్రులను ఇంచార్జ్ లుగా నియమించారు.
మునుగోడులో భారీ బహిరంగ సభ పెట్టి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలో దిగనున్నారు కేసీఆర్. మునుగోడు, హుజురాబాద్ లో కేసీఆర్ మీటింగ్ లతోనే ప్రచారం చేశారు. ఈసారి మాత్రం స్వయంగా కేసీఆర్ నే ఎన్నికల రణరంగ క్షేత్రంలోకి దిగి పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జాతీయ పార్టీలకు తెలంగాణలో అవకాశం రాదు అనే భావన తీసుకురావాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ లో గ్రూపుల గోలతో చివరి వరకు అభ్యర్థిని ప్రకటించకుండా కాలయపన చేసి డిపాజిట్లు కూడా రాకుండా సోంత పార్టీ నేతలే చేస్తున్నారు. మరో వైపు మునుగోడులో బీజేపీ జెండా ఎగురవేసి వచ్చే ఎన్నికలల్లో బీజేపీ తెలంగాణ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ప్రజల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఎదిఎమైనా తెలంగాణలో జరిగే ఈ ఎన్నికల మాత్రం సెమీ ఫైనల్ అవుతుంది.