Advertisement

Advertisement


Home > Politics - Andhra

అతిగా ఉలికి పడుతున్న బోండా

అతిగా ఉలికి పడుతున్న బోండా

తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వరరావు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే అతి జాగ్రత్తను పాటిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డిని రాయితో గాయపరిచిన వ్యక్తి వెనుక ఉండి ప్రోద్బలం అందించింది ఎవరు అనే ప్రశ్న పోలీసు వర్గాలు ఒకవైపు లేవనెత్తుతుండగానే అందరికంటే ముందుగా బోండా ఉమామహేశ్వరరావు స్పందిస్తున్నారు. నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ రంకెలు వేస్తున్నారు. నా పేరు చెప్పాల్సిందిగా పోలీసులు అరెస్టు చేసిన అమాయకులను చిత్రహింసలు పెడుతున్నారు అంటూ బోండా ఉమామహేశ్వరరావు- అంతా తన కళ్ళతో చూసినట్లుగా కట్టుకథలు చెబుతుండడం గమనార్హం.

జగన్ మీద రాయి విసిరినది వేముల సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన కుర్రవాడు అనేది పోలీసులు తేల్చారు. వేముల దుర్గారావు అనే వ్యక్తి జగన్ మీద రాయి విసిరితే భారీ మొత్తంలో నగదు ఇస్తానని సతీష్ ను ప్రలోభ పెట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సదరు వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు బోండా ఉమామహేశ్వర రావుకు అనుచరుడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా దుర్గారావు వెనుక పార్టీ నాయకుల హస్తం ఉన్నదా అని తెలుసుకోవడం పోలీసులు విధి. ఆ మేరకు ప్రశ్నలు సంధించడం చాలా సహజం. 

కానీ బొండా ఉమామహేశ్వరరావు ఎందుకు ఉలిక్కి పడుతున్నారనేది అర్థం కాని సంగతి. బహుశా బోండా ఉమాను కూడా ఒకసారి ప్రశ్నిస్తే ఇంకా స్పష్టత వస్తుందని పోలీసులు భావించి ఉండవచ్చు. అయితే పోలీసులు ఆయన కోసం ఇంటి వద్దకు వెళితే.. అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్లిపోయి.. అక్కడకు పోలీసులు వెళితే.. వారి కనుగప్పి వెనుక గేటు నుండి పారిపోయి చాలా పెద్ద ప్రహసనం నడిపించారు బోండా ఉమా. తాను నిజంగానే నిర్దోషి అయితే.. పోలీసులు తనను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా పారిపోవాల్సిన అవసరం ఏమున్నదనేది పలువురి సందేహం.

ఆయన కోసం పోలీసులు వస్తే.. బోండా ఉమా.. అన్ని డివిజన్లలోని తెలుగుదేశం కార్యకర్తలకు మెసేజీలు పంపి.. వారినందరినీ పార్టీ ఆఫీసు వద్దకు రప్పించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక డ్రామాగానే కనిపిస్తోంది. ఆయన ఎంతగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూపోతే.. అంతగా ఆయన మీద అనుమానాలు బలపడతాయని బోండా ఉమా తెలుసుకుంటే మంచిది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?