
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మోదీ సర్కార్ మరోసారి దన్నుగా నిలిచింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త. నిధుల విడుదలలో జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల అది రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది.
కాంట్రాక్టు పనులకు కక్కుర్తిపడి చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. అయితే నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంపై పదేపదే ఒత్తిడి పెంచి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు.
ఏపీ విభజన సమయంలో రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధుల్ని కూడా ఇటీవల సీఎం జగన్ సాధించారు. రూ.10 వేల కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి వచ్చాయి. మరోవైపు తాజాగా మరో శుభవార్త. పోలవరం ప్రాజెక్టుకు దాదాపు 13 వేల కోట్ల నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు 2013-14 ధరలతో కాకుండా ప్రస్తుత రేట్లతో నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించడం జగన్ సాధించిన అద్భుత విజయంగా పలువురు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో పరిమితులను తొలగించడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. ఇలా అనేక సానుకూల అంశాలతో ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు కేంద్ర ఆర్థికశాఖ డైరెక్టర్ ఎల్‌కే త్రివేది ఒక లేఖను రాశారు.
ఇటీవల కాలంలో ప్రతిదీ జగన్‌కు సానుకూల నిర్ణయాలు రావడంతో చంద్రబాబునాయుడు, ఇతర ప్రతిపక్షాల నేతలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల కోసం సీఎం హోదాలో చంద్రబాబు పలు దఫాలు ఢిల్లీ వెళ్లినా మోదీ సర్కార్ పట్టించుకోలేదని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు మాత్రం జగన్‌కు అన్ని విధాలా మోదీ సర్కార్ అండగా నిలుస్తోందని ఎల్లో బ్యాచ్ ఒకటే ఏడ్పు. ఇలాగైతే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారేమో అన్న భయం ఎల్లో టీమ్‌ని వెంటాడుతోంది.
నిధుల కొరతతో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆశించిన ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగేలా జగన్ వ్యూహాన్ని రచించారు. ఎన్నికల నాటికి ఏ ఒక్క వర్గం తనకు వ్యతిరేకం కాకుండా అన్నీ చక్కదిద్దేందుకు జగన్ తెలివిగా ముందుకెళుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బాబు భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకమవుతోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా